E-Paper
Advertisement

కుళ్లిన మాంసంతో దందా.. ప్రధాన సూత్రధారి అరెస్ట్​.. 10 టన్నుల సరుకు సీజ్

కుళ్లిన మాంసంతో దందా.. ప్రధాన సూత్రధారి అరెస్ట్​.. 10 టన్నుల సరుకు సీజ్
Advertisement

Hyderabad Crime: హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్లకు కుళ్లిన మాంసాన్ని సప్లే చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసారు. అతడి గోడౌన్ పై దాడి చేసి ఏకంగా 10 టన్నుల మాంసాన్ని సీజ్ చేశారు. డబ్బు సంపాదన కోసం జనం ఆరోగ్యంతో చెలగాటాలాడుతున్న వ్యక్తిని కటకటాలపాలు చేశారు.

హైదరాబాద్ మంగళ్ హాట్ ప్రాంతంలో నివాసముంటున్న అఫ్రోజ్​ మాంసం వ్యాపారి. నగరంలోని వేర్వేరు హోటళ్లు, బిర్యానీ సెంటర్లకు మాంసాన్ని సప్లయ్​ చేస్తుంటాడు. న్యాయంగా చేసే వ్యాపారంలో వస్తున్న లాభాలతో సంతృప్తి పడకుండా కొన్ని నెలలుగా కుళ్లిన మాంసం దందా మొదలు పెట్టాడు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్​ తదితర రాష్ట్రాల నుంచి చనిపోయిన మేకలను తక్కువ ధరకు తెప్పించి ఇక్కడ వాటి మాంసాన్ని అమ్ముతున్నాడు.

Advertisement

Also Read: గ్యాస్ స్టవ్ vs ఇన్‌ఫ్రారెడ్.. డీప్ ఫ్రై వంటకాలకు.. ఏది బెస్ట్ అంటే?

ఈ మేరకు సమాచారం అందగా గోల్కొండ జోన్​ టాస్క్​ ఫోర్స్​ అధికారులు మంగళ్​ హాట్ ప్రాంతంలో అతను నడుపుతున్న రెండు గోడౌన్లపై దాడులు చేశారు. తనిఖీలు జరుపగా పూర్తిగా కుళ్లిపోయిన పది టన్నుల మాంసం దొరికింది. దానిని సీజ్ చేసిన అధికారులు అఫ్రోజ్​ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కల్తీ వ్యాపారంలో అతనికి సహకరిస్తున్న మరో నలుగురిని కూడా అరెస్ట్ చేశారు. సీజ్​ చేసిన మాంసం నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్​ కు తరలించారు.

Advertisement

Also Read: ఏప్రిల్ 1.. అందరినీ ‘ఫూల్స్’ చేసే రోజు అసలు ఎక్కడ ఎలా మొదలైంది? దీని వెనుక ఉన్న షాకింగ్ హిస్టరీ ఇదే!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×