E-Paper
Advertisement

Chandrayaan 5 mission: మామా వచ్చేస్తున్నా? చంద్రుడి పైకి చంద్రయాన్ -5

Chandrayaan 5 mission: మామా వచ్చేస్తున్నా? చంద్రుడి పైకి చంద్రయాన్ -5
Advertisement

Chandrayaan 5 mission: చంద్రయాన్-5 ప్రయోగానికి భారత్ అడుగులు పడుతున్నాయి. చంద్రయాన్‌ 5 కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ ప్రకటించారు. చంద్రయాన్‌ 3లో 25 కిలోల ప్రజ్ఞాన్‌ రోవర్‌ను చంద్రునిపై దించారు ఇస్రో శాస్త్రవేత్తలు. చంద్రయాన్‌ 5లో 250 కిలోల రోవర్‌ను చంద్రునిపై దించేందుకు ప్రణాళిక రెడీ చేస్తోంది. జపాన్ సహకారంతో మిషన్ చంద్రయాన్ 5 చేపట్టనున్నారు. చంద్రాయాన్ 5 విజయం అయిన తర్వాత చంద్రయాన్ 4 మిషన్ చేపట్టనున్నారు.

ఈ మిషన్ కోసం జపాన్ అంతరిక్ష సంస్థ JAXAతో మూడో సారి భేటీ అయినట్టు ఇస్రో ప్రకటించంది. చంద్రయాన్-5 భారతదేశ అంతరిక్ష ప్రయోగాల్లో ఓ మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నారు. భారతీయ వ్యోమగాములు చంద్రునిపైకి కాలుమోపడమే లక్ష్యంగా చంద్రయాన్-5 ప్రయోగం ఉండనుంది. ఈ నెల 13, 14న బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయానికి JAXA ప్రతినిధుల బృందం వచ్చింది. చంద్రయాన్-5 గురించి కీలక చర్చలు జరిగాయి.

Advertisement

చంద్రుని కక్ష్యలో చంద్రయాన్-1, 2 ప్రయోగాలు జరిగాయి. ల్యాండర్-రోవర్‌ను చంద్రునిపై దించి చంద్రయాన్-3 ప్రయోగం చేశారు. చంద్రుని దక్షిణ ధ్రువంలో శాశ్వతంగా నీడ ఉన్న ప్రాంతంలో నీటిపై ప్రయోగాలు జరగనున్నాయి. దీని కోసం చంద్రయాన్ 5 ను ప్రయోగిస్తారు.

మరో కీలక మైలు రాయిని దాటడానికి ఇస్రో సిద్ధమవుతుంది. కొద్ది రోజుల క్రితం చంద్రయాన్-5 కేంద్రం ఆమోదం తెలిపింది. జపాన్ సహాకారంతో చంద్రయాన్-5 ని చెప్పాట్టబోతున్నారని తెలిపారు. చంద్రయాన్-3లో 25 కేజీల ప్రజ్ఞాన్ రోవర్‌ని చంద్రుని పైకి పంపించారు. ఈ సారి ఏకంగా 250 కేజీల రోవర్‌ని పంపడానికి అధికారులు సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి చంద్రుని పైనా ఉన్న ఉపిరితలాన్ని అధ్యయానం చేయాడానికి ప్రయోగాలు ఇస్రో చేపడుతున్నారు.

Advertisement

Also Read: మొదటి భర్తను దోచుకొని రెండో భర్తకు డబ్బులు పంపిన భార్య.. టెక్నాలజీతో గుట్టురట్టు

అయితే మొదటిసారిగా 2008లో చంద్రయాన్-1.. అక్కడ ఉన్న కేమికల్స్, మినరల్స్, ఫోటోజియోలాజికల్ మ్యాపినింగ్ మొత్తం మొదటి చంద్రయాన్ ద్వారా తీసుకున్నారు. అలాగే చంద్రయాన్- 2 చివరి నిమిషంలో కొంత ఇబ్బంది పెట్టిన 98 శాతం విజయం సాధించింది. కేవలం 2 శాతం మాత్రమే సక్సేస్ కాలేకపోయింది. అయిన అక్కడ ఉన్న కేమారాతో అది ఇప్పటికి కూడా ప్రతిరోజూ వందలాది ఫోటోలు తీసి పంపిస్తుంది.

ఇంకా చంద్రయాన్-3 గురించి అందరికి తెలిసిన విషయమే.. 2023 ఆగస్టున విక్రమ్ అనే రోవర్‌ని అక్కడికి దించారు. దీన్ని విజయవంతం చేశారు. ఇప్పుడు జపాన్ సహాకారంతో చంద్రయాన్-5 అత్యంత ప్రతిష్టాత్మకంగా దించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×