BigTV English

Hyderabad News: రూ. 25 కోట్లకు కుచ్చు టోపి.. హైదరాబాద్‌లో లగ్జరీ కార్ డీలర్ అరెస్ట్‌!

Hyderabad News: రూ. 25 కోట్లకు కుచ్చు టోపి.. హైదరాబాద్‌లో లగ్జరీ కార్ డీలర్ అరెస్ట్‌!

Hyderabad News: లగ్జరీ కార్లు హైదరాబాద్‌ కేరాఫ్‌గా మారిందా? విదేశీ బ్రాండ్లు భాగ్యనగరంలో లభిస్తున్నాయా? దాదాపు ఏడాదిన్నర కిందట పన్నుల ఎగ్గొట్టిన లగ్జరీ వాహనాలపై పోలీసులు ఓ కన్నేశారు. ఆ తర్వాత షరా మామూలే. తాజాగా లగ్జరీ కార్ల పేరిట కస్టమ్స్ అధికారులకు కుచ్చుటోపి పెట్టాడు ఓ వ్యక్తి. ఈ వ్యవహారంలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.


‘లక్కీ భాస్కర్’ సినిమాలో ఓ సీన్ ఉంటుంది. విదేశాల నుంచి వచ్చిన లగ్జరీ కార్లను గోవాలో ఎక్కువ రేటు అమ్ముతాడు. ఆ కార్లు తీసుకెళ్లే క్రమంలో నానా సమస్యలు ఎదుర్కొంటాడు హీరో. అది కేవలం రీల్ మాత్రమే. రియల్ విషయానికి వద్దాం. హైదరాబాద్‌కి చెందని లగ్జరీ కారు డీలర్ అలాంటి పని చేశాడు. అడ్డంగా బుక్కయ్యాడు. ఒకటి రెండు కాదు ఏకంగా రూ. 100 కోట్లకు పన్ను ఎగ్గొట్టాడు. ఇతగాడిపై కన్నేసి మరీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

పైన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు బషరత్ ఖాన్. హైదరాబాద్‌లో ‘కారు లాంజ్’ పేరుతో ఓ షో రూమ్ ఏర్పాటు చేశాడు. అచ్చట ఓన్లీ ఫారెన్ కార్లు మాత్రమే అమ్మబడును. విదేశాల నుంచి లగ్జరీ కార్లను ఇండియాలోకి తెస్తే పన్నులు అధికంగా ఉంటాయి. దీన్ని నుంచి తప్పించుకోవడానికి చాలామంది సెలబ్రిటీలు ఆ మధ్య ప్రయత్నించారు. చివరకు ట్యాక్సులు కట్టాల్సివచ్చింది.


‘కార్ లాంజ్’ ఓనర్ బ‌ష‌ర‌త్ ఖాన్. అతడు అమెరికా, జపాన్ దేశాల నుంచి లగ్జరీ కార్లను దిగుమతి చేసుకునేవాడు. అధిక కస్టమ్స్ సుంకాలను తప్పించుకోవడానికి నకిలీ పత్రాలు, తక్కువ విలువ కలిగిన ఇన్‌ వాయిస్‌లను క్రియేట్ చేశాడు. ఆయా వాహనాల విలువను తక్కువగా చూపించి దాదాపు రూ. 25 కోట్ల కస్టమ్స్ సుంకాలను ఎగవేసినట్టు గుర్తించారు. చివరకు అతడ్ని గుజరాత్‌లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ALSO READ: గొల్కొండలో దారుణం.. 14 రోజుల పసికందును గొంతు కోసిన చంపిన తండ్రి

అధికారుల ప్రాథమిక దర్యాప్తులో అమెరికా, జపాన్ దేశాల నుంచి లగ్జరీ కార్లను దిగుమతి చేసుకునేవాడు. వాటిని దుబాయ్ లేదా శ్రీలంకకు తీసుకెళ్లి ఎడమ వైపు డ్రైవ్ సిస్ట‌మ్‌ను కుడి వైపు డ్రైవ్‌కు మళ్లీ ఇండియాకు తెచ్చేవాడు. ఆ తర్వాత నకిలీ పత్రాలను ఉపయోగించి ఆ వాహనాలను ఇండియాలోకి తీసుకొచ్చినట్టు అధికారులు గుర్తించారు.

ఇలా 30 లగ్జరీ కార్లను అక్రమంగా దిగుమతి చేసుకున్నట్లు గుర్తించారు. హమ్మర్ ఈవీ, కాడిలాక్ ఎస్కలేడ్, రోల్స్ రాయిస్, లెక్సస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్, లింకన్ నావిగేటర్ ల‌గ్జ‌రీ మోడళ్లు ఉన్నట్లు తేల్చారు. దశాబ్దం పాటు హైదరాబాద్‌లో లగ్జరీ కార్ల షోరూమ్‌ను నడుపుతున్న బ‌ష‌ర‌త్ ఖాన్, ఎనిమిది వాహనాలను దిగుమతి చేసుకున్నట్లు తేలింది.

దీనివల్ల రూ. 7 కోట్లకు పైగా కస్టమ్స్ సుంకం ఎగవేత‌కు పాల్పడ్డాడని అధికారులు ఆరోపణ. ఖాన్‌కు అతని వ్యాపార భాగస్వాములు ఉన్నారు. వారిలో డాక్టర్ అహ్మద్ ఒకరు. అక్ర‌మంగా దిగుమతి చేసుకున్న లగ్జరీ వాహనాలను అతడు తన ఫామ్‌హౌస్‌లో ఉంచేవాడని తెలుస్తోంది. బ‌ష‌ర‌త్ ఖాన్ వ‌ద్ద కార్లు కొనుగోలు చేసిన క‌స్టమర్లు.. పన్నులను ఎగవేసేందుకు నగదు రూపంలో చెల్లింపులు చేసిన‌ట్లు సమాచారం.

బ‌ష‌ర‌త్ ఖాన్ లాంటి వ్యక్తులు ఇండియా వ్యాప్తంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ మాత్రమే కాకుండా ముంబై, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ అంతటా విస్తరించినట్టు అధికారుల మాట. అరెస్టు చేసిన బ‌ష‌ర‌త్ ఖాన్ జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. రేపో మాపో అతడ్ని కస్టడీకి తీసుకోనున్నారు. పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు బయటకు  వస్తాయో.

Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×