BigTV English

Paragliding : పారా గ్లైడింగ్.. భద్రమేనా..!

Paragliding : పారా గ్లైడింగ్.. భద్రమేనా..!

Paragliding : పారా గ్లైడింగ్.. ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో ఎంతో ఆకర్షించే ఈ స్టంట్.. ప్రస్తుతం ఎందరో అమాయకుల ప్రాణాలు బలితీసుకుంటుంది. సరదా కోసం ప్రయత్నిస్తే జీవితాలనే హరించేస్తుంది. నిత్యం జరుగుతున్న ప్రమాదాలతో  ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. అయినప్పటికీ భద్రతా చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అసలు ఈ నిర్లక్ష్య ధోరణి ఇంకెన్నాళ్లు.. పట్టించుకునేదెవరు


పారా గ్లైడింగ్.. ఎంతో మంది టూరిస్టులను ఆకర్షించే స్టంట్. ప్రత్యేకంగా ఈ పారా గ్లైడింగ్ ప్రయత్నించటానికే పర్యాటకులు కొన్ని ప్రదేశాలకు వెళుతూ ఉంటారు. హిమాచల్ ప్రదేశ్, సిమ్లా, కులు మనాలి, గోవా వంటి ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దేశీయుల నుంచి విదేశీయుల వరకూ ప్రతీ ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ప్రయత్నిస్తుంటారు. మరి ఈ స్టంట్ భద్రమేనా.. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని గాలిలో ఎగరటం ఎంత వరకూ సేఫ్.. మరీ అరకొర సదుపాయాలు ఉన్న చోట ప్రయత్నించటం అజాగ్రత అనుకోవాలా.. లేదా ఏం కాదులో అనే ధీమానా.. ప్రాణాలంటే లెక్కలేకుండా అజాగ్రత్తగా నడిపిస్తున్న యాజమాన్యం బాధ్యత ఎంత..

తాజాగా ఉత్తర గోవాలో కేరి గ్రామంలో పారాగ్లైడింగ్‌లో ఓ పారా గ్లైడింగ్ ప్రమాదం చోటుచేసుకుంది. పారాగ్లైడింగ్ లో నిర్లక్ష్యం కారణంగానే ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పారాగ్లైడింగ్ చేస్తున్న మహిళతో పాటు కోచ్‌ కూడా చనిపోయారు. చనిపోయిన మహిళ పూణేకు చెందిన శివానీ డేబుల్ గా, కోచ్ సుమన్ నేపాలీ గా పోలీసులు గుర్తించారు. ఈ స్టంట్ కు సంబంధించి ‘అడ్వెంచర్ స్పోర్ట్స్ కంపెనీ’ చట్టవిరుద్ధంగా నడుపుతుందని తెలుస్తుంది.


ALSO READ : లారీని గుద్దేసిన కాలేజీ బస్సు.. ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..

గత ఏడాది సైతం హిమాచల్ ప్రదేశ్ లోని కులులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. హైదరాబాద్ కు చెందిన ఓ మహిళా పర్యాటకురాలు ప్రమాదవశాత్తూ మృతి చెందింది. ఈ కేసులో పైలట్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇక ప్రమాదానికి కారణమైన పైలట్‌కు రిజిస్టేషన్ ఉందని, గ్లైడింగ్‌కు మంచి పరికరాలే ఉపయోగించామని, భద్రత విషయంలో నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది.

రెండేళ్ల క్రితం సైనిక శిక్షణలో భాగంగా హెలికాప్టర్ నుంచి కిందకు దూకిన మరైన్ కమాండో సైతం సకాలంలో ప్యారాచూట్ తెలుసుకోకపోవడంతో ప్రాణాలు కోల్పోయాడు. కోల్కతాలో జరిగిన ఈ సంఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. శిక్షణలో భాగంగా పారా గ్లైడింగ్ చేస్తూ కిందకి దూకిన ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన చందక గోవింద్ శిక్షణ పొందుతూ చనిపోవడంతో అప్పట్లో తీవ్ర కలకలం రేపింది.

ఇక ఇలాంటి సంఘటనలు దేశ వ్యాప్తంగా ఎక్కడికక్కడ జరుగుతూనే ఉన్నాయి. వీటికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయినప్పటికీ టూరిస్టుల ప్రాణాలతో యాజమాన్యాలు చెలగాటమాడుతున్నాయనే చెప్పాలి. ఎన్ని విధాలుగా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఫలితం లేకపోతుంది. వేలల్లో డబ్బులు దోచుకుంటున్న పారా గ్లైడింగ్ నిర్వాహకులు పర్యాటకుల ప్రాణాలను మాత్రం పట్టించుకోవడం లేదు. మరి ఈ నిర్లక్ష్యపు ధోరణి ఎప్పటికి మారుతుందో.. దీనిపై త్వరలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.

Related News

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Tamilnadu Crime: రాజకీయ నేత ఫామ్‌హౌస్.. ఎస్ఐని చంపేశారు, ఏం జరిగింది?

Karimnagar Crime: యూట్యూబ్ చూసి డైరెక్షన్ ఇచ్చింది.. పనంతా ప్రియుడు చేశాడు, చివరకు ఏమైంది?

Serial killer: అతడి ఇల్లంతా రక్తం.. ఎముకల గుట్ట.. కేరళలో ఒళ్లు గగూర్పాటు కలిగించే ఘటన!

Road Accident: చెట్టును ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, మరో ఆరుగురికి గాయాలు

Big Stories

×