E-Paper
Advertisement

She Teams: షీ టీమ్స్​ చూస్తున్నాయ్.. హద్దు దాటితే కటకటాలే.. తస్మాత్ జాగ్రత్త!

She Teams: షీ టీమ్స్​ చూస్తున్నాయ్.. హద్దు దాటితే కటకటాలే.. తస్మాత్ జాగ్రత్త!
Advertisement

She Teams: హైదరాబాద్ లోని పోకిరీలపై షీటీమ్స్ ఉక్కుపాదం మోపుతున్నాయి. పబ్లిక్ ప్లేసుల్లో ఆడవారిని ఇబ్బందులకు గురిచేస్తున్న వారిని గుర్తించి జైలుకు పంపిస్తున్నాయి. గడిచిన వారం రోజుల్లో సైబర్ కమిషనరేట్ పరిధిలో 113 డెకాయ్​ ఆపరేషన్లు జరిపిన షీ టీమ్స్.. 41 మంది పోకిరీలను అరెస్టు చేశాయి.

మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్ బృందాలు.. నిరంతరం నిఘా కొనసాగిస్తున్నట్లు సైబరాబాద్ ఉమెన్​ సేఫ్టీ వింగ్​ డీసీపీ కే.సృజన తెలిపారు. ఇక ముందు కూడా డెకాయ్​ ఆపరేషన్లను మరింత ముమ్మరంగా జరుపుతామన్నారు. రద్ధీ ఎక్కువగా ఉండే మార్కెట్లు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లతోపాటు కాలేజీలు, స్కూళ్ల వద్ద నిత్యం మఫ్టీల్లో మహిళా పోలీసులు పహారా కాస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

Advertisement

ఈ షీ టీమ్స్ బృందాలు.. పోకిరీలు చేస్తున్న వెకిలి చేష్టలను ఫోటోలు తీయటంతోపాటు వీడియో రికార్డింగ్ చేసి మరీ అదుపులోకి తీసుకుంటున్నాయి. హద్దులు దాటి ప్రవర్తించిన వారిపై కేసులు నమోదు చేసి కోర్టుల్లో హాజరు పరుస్తున్నాయి. మిగితావారికి వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్​ ఇస్తున్నాయి. ఇలా గడిచిన వారం రోజుల్లో 41మంది ఆవారాగాళ్లను పట్టుకున్నారు.

మరోవైపు మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై యాంటీ హ్యూమన్​ ట్రాఫికింగ్ సిబ్బంది (ఏహెచ్​టీయూ) ఉక్కుపాదం మోపుతున్నారు. వ్యభిచార ఊబిలో చిక్కుకోబోయిన ఐదుగురిని గత వారం కాపాడిన సిబ్బంది.. ఇందుకు కారణమైన ఐదుగురిని అరెస్టు చేసి వారిపై కేసులు పెట్టారు. ఓ ట్రాన్స్​ జెండర్​ ను కూడా అరెస్ట్ చేశారు.

Advertisement

అలాగే తొమ్మిది మంది బాలురతో భిక్షాటన వంటి పనులు చేయిస్తున్న ఎనిమిది మందిని అరెస్ట్ చేసి వారిపై జువెనైల్ జస్టిస్​ యాక్ట్​ ప్రకారం కేసులు నమోదు చేశారు. అదే సమయంలో చిన్న చిన్న కారణాలతో కాపురాలను నరకం చేసుకున్న ఇరవై జంటలకు సీడీఈడబ్ల్యు సెంటర్లలో కౌన్సిలింగ్ ఇచ్చారు. తద్వారా వారి మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించారు.

Also Read: Ramchander Rao: భట్టి పొరపాటున గతేడాది బడ్జెట్ చదివారేమో.. తెలంగాణ బీజేపీ చీఫ్ సెటైర్లు!

మరోవైపు సనత్​ నగర్​ లోని ఎలికో హెల్త్​ కేర్ సర్వీసెస్​ లో వంద మందికి ఉమెన్ సేఫ్టీ, మహిళల కోసం ఉన్న చట్టాలు, హక్కుల గురించి తెలియచేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా 181 హెల్ప్​ నెంబర్​ ను నడిపిస్తున్నట్టు డీసీపీ సృజన తెలిపారు. ఎలాంటి సమస్య ఎదురైనా మహిళలు ఈ నెంబర్​ కు ఫోన్​ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. పిల్లల కోసం చైల్డ్ హెల్ప్​ లైన్​ 1098 అందుబాటులో ఉందన్నారు. సైబర్​ నేరాలకు గురైన వారు 1930 నెంబర్​, 100 నెంబర్​ కు డయల్ చేయవచ్చని చెప్పారు.

Also Read: Ramadan Eid Mubarak 2026: మీ ఆత్మీయుల కోసం రంజాన్‌ స్పెషల్ విషెస్, వాట్సప్ స్టేటస్‌ కొటేషన్లు ఇవిగో!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×