E-Paper
Advertisement

Ramchander Rao: భట్టి పొరపాటున గతేడాది బడ్జెట్ చదివారేమో.. తెలంగాణ బీజేపీ చీఫ్ సెటైర్లు!

Ramchander Rao: భట్టి పొరపాటున గతేడాది బడ్జెట్ చదివారేమో.. తెలంగాణ బీజేపీ చీఫ్ సెటైర్లు!
Advertisement

Ramchander Rao: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పొరపాటున గతేడాది బడ్జెట్ చదివినట్లున్నారని బీజేపీ రాష్ట్ర​ అధ్యక్షుడు రాంచందర్ రావు ఎద్దేవా చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత బడ్జెట్ కు.. ప్రస్తుత బడ్జెట్ కు పెద్ద తేడా ఏమీ లేదన్నారు. విద్యాశాఖకు కేవలం 8 శాతం నిధులు కేటాయించడం బాధాకరమని మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ అని వ్యాఖ్యానించారు.

విద్యా రంగానికి గతేడాది కంటే రూ.1000 కోట్లు పెంచినట్లు చూపిస్తున్నా, ఓవరాల్ బడ్జెట్‌లో దీని వాటా కేవలం 8 శాతం మాత్రమేనని రామచంద్రరావు గుర్తు చేశారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్(13%), బీహార్ (21%) తమ బడ్జెట్‌లో విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతలో సగం కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలు అని గొప్పలు చెప్పడం తప్ప, విద్యా వ్యవస్థను మెరుగుపరిచే ఒక్క ప్రయత్నం కూడా కనిపించడం లేదన్నారు.

Advertisement

ఆరోగ్య విషయంలో పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదని తెలంగాణ బీజేపీ చీఫ్ చురకలు అంటించారు. ఆరోగ్యశ్రీకే గతి లేదని, అలాంటిది పెన్షన్లకు ముడి పెడుతున్నారంటూ విమర్శించారు. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం తన ఘనతగా చెప్పుకుంటున్న ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలతో పాటు, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా పథకాల వల్ల వచ్చినవేనని రాంచందర్ రావు స్పష్టం చేశారు.

రీజనల్ రింగ్ రోడ్, దాని పక్కన వచ్చే రీజనల్ రింగ్ రైల్ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఫండింగ్ అని, కేవలం భూసేకరణ తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదని రామచంద్రరావు ఎండగట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఐదుసార్లు రైతు భరోసా ఇవ్వాలని, కానీ ఇప్పుడు వేసేది మూడోసారి మాత్రమేనని పేర్కొన్నారు. బడ్జెట్ తో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెవిలో పువ్వు పెట్టిందని రాంచందర్ రావు ఎద్దేవాచేశారు.

Advertisement

Also Read: Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసులపై కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ముందా?.. రేవంత్‌కు బండి సంజ‌య్ సవాల్

మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆలయాల్లో పనిచేసే అర్చకుల వేతనాలు, ధూపదీప నైవేద్యానికి బడ్జెట్ డిమాండ్ గురించి ఎక్కడ మాట్లాడలేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అనేక హిందూ ఆలయాలపై దాడులు జరిగాయని ఆయన గుర్తుచేశారు. బడ్జెట్ లో హైదరాబాద్ కు సున్నా ఇచ్చారని చురకలంటించారు. జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేశారని, మరి దానిపై బాధ్యత ఏదని ప్రశ్నించారు. నిధులు కేటాయించకుంటే జీహెచ్ఎంసీ ఎలా అభివృద్ధి చెందుతుందని నిలదీశారు. ఇదొక ఫాల్స్, ఫెయిల్డ్, ఫ్యాన్సీ బడ్జెట్ అంటూ రాంచందర్ రావు విమర్శించారు.

Also Read: Ramadan Eid Mubarak 2026: మీ ఆత్మీయుల కోసం రంజాన్‌ స్పెషల్ విషెస్, వాట్సప్ స్టేటస్‌ కొటేషన్లు ఇవిగో!

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×