Transgenders: బలవంతపు వసూళ్లకు సంబంధించిన ఆరోపణలపై ఆదిలాబాద్ జిల్లాలో ట్రాన్స్ జెండర్‌లు స్పందించారు. జిల్లాలోని స్థానిక ప్రెస్ క్లబ్‌లో మీడియాతో కొందరు ట్రాన్స్ జెండర్లు మాట్లాడారు. కొందరు చేసిన తప్పుకు మొత్తం ట్రాన్స్ జెండర్ సమాజం పై ఆపాదించడం సరికాదన్నారు. కొందరు చేస్తున్న పనులతో అందరూ ట్రాన్స్ జెండర్‌లకు అపవాదు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఎక్కువ మంది నకిలీల వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని, చీర కట్టిన ప్రతి ఒక్కరు ట్రాన్స్ జెండర్ కాదని, మగవాళ్ళు సైతం చీర కట్టుకుని ఇలాంటి చర్యలకు పాలపడుతున్నారని అలాంటి వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలో ఎన్టీఆర్ చౌక్ లో ట్రాన్స్ జెండర్ బైక్ చోరీ ఘటనకు సంబంధించి మాట్లారు.
Also read: లేటుగానైనా మధుయాష్కీకి మంచి గుర్తింపు.. ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు.. కలిసివచ్చిన వేళ..!
చీరకుడుతూ తమలోని బహిష్కృత ట్రాన్స్ జెండర్ ఆ చోరికి పాల్పడ్డారని, ఆ ఘటనతో ఆదిలాబాద్ ట్రాన్స్ జెండర్ లందరికీ అపవాదు రావడం బాధకలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. తాము బలవంతపు వసూళ్లకు పాల్పడమని ప్రేమతో ఇచ్చిన వారి వద్ద నుండే డబ్బులు తీసుకుంటామని ట్రాన్స్ జెండర్స్ స్పష్టం చేశారు.
Also read: వంట చేయడం నుంచి ఇల్లు తుడవటం వరకు.. అన్నీ ఈ ఫ్యూచర్ ఏఐ గ్యాడ్జెట్స్ చేసేస్తాయ్!