Ram Pothineni: సాధారణంగా హీరోలు లేదా హీరోయిన్లు తమ అభిమానుల పట్ల ఎంతో సానుకూల దృక్పథంతో ఉంటారు. తమ అభిమానికి ఏదైనా ఆపద వచ్చింది అంటే ఆదుకోవడానికి హీరోలు ముందు వరుసలో ఉంటారు. రామ్ పోతినేని (Ram Pothineni)సైతం తన అభిమానికి అండగా నిలిచారు. తూర్పు గోదావరి జిల్లాలోని దుప్పలపూడి గ్రామానికి చెందిన 18 ఏళ్ల అమ్మాయి శశి(Sasi)కి ఓ అరుదైన జన్యువ్యాధి సోకింది. మతిస్థిమితం కోల్పోయిన ఆమె మంచానికే పరిమితమయ్యారు. కేవలం తన అభిమాన హీరో రామ్ పోతినేని పేరు చెబితేనే తన ముఖంలో కదలికలు ఉంటాయి. ఆయన ఫోటోలు చూపిస్తేనే అన్నం తింటుంది అంటూ ఆమె కుటుంబ సభ్యుల సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని విడుదల చేశారు.
ఇక ఈ విషయం తెలిసిన రామ్ పోతినేని వెంటనే వీడియో కాల్ ద్వారా తన అభిమాని శశిని పరామర్శించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే జెనెటికల్ డిజాస్టర్ తో బాధపడుతున్న తన అభిమాని కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. తన కుటుంబానికి కావాల్సిన నిత్యవసర వస్తువులతో పాటు శశి మందులకు, వైద్యానికి అయ్యే ఖర్చు కూడా భరిస్తానని తెలిపారు. అయితే తాజాగా రామ్ పోతినేని అభిమానులు శశి కుటుంబానికి కావలసిన వస్తువులను తన ఇంటికి చేరవేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇలా శశి కుటుంబ బాధ్యతలను మాత్రమే కాకుండా ఆమె వైద్యానికి అయ్యే ఖర్చులను కూడా తాను భరిస్తానని చెప్పడంతో ఈ విషయం తెలిసిన అభిమానులు రామ్ మంచి మనసుపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎనర్జిటిక్ స్టార్ విత్ గోల్డెన్ హార్ట్ అంటూ రామ్ చేసిన ఈ మంచి పనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపోతే గతంలో కూడా పలువురు టాలీవుడ్ హీరోలు కూడా వారి అభిమానులు ఆపదలో ఉంటే స్వయంగా వెళ్లి పరామర్శించి వారి బాధ్యతలను తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రామ్ పోతినేని సైతం తన అభిమాని పట్ల మంచి మనసు చాటుకున్నారు.
@ramsayz Sir thank you ❤ u give new hope new life or 1 beautiful message that – "Kuturlu Bhaaram Kaadu /Aadapillalu Bhaaram Kaadu " kindness humanity perfect ❤ …. BangaaRammm from heart annaaa , love u always ❤ … 🙏#RAPO #RamPothineni #RAPO23 #Dharman https://t.co/jqr8ysCuyt
— kalka ❤ (@kalkarudraswaro) September 12, 2026
ఇక రామ్ సినిమాల విషయానికి వస్తే ఇటీవల కాలంలో ఈయన పలు సినిమాలలో నటిస్తున్నప్పటికీ కూడా సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నారని చెప్పాలి. ఇటీవల ఈయన ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇలా వరుస సినిమాలు ప్రేక్షకులను నిరాశ పరుస్తున్న నేపథ్యంలో ఈసారి ఏకంగా డైరెక్టర్ గా మారిపోయారు. రామ్ తన స్వీయ దర్శకత్వంలోనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సరైన రామ్ మంచి సక్సెస్ అందుకునేనా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
Also Read: దమ్ముంటే ‘స్పిరిట్’ సినిమాని పడగొట్టండి.. సవాల్ విసిరిన ప్రొడ్యూసర్!