Ganja Chocolates Seized: గంజాయి చాక్లెట్లకు హైదరాబాద్ సిటీ అడ్డాగా మారిందా? ఈ వ్యాపారం చాపకింద నీరులా విస్తరిస్తోందా? వారంలో రెండు లేదా మూడుసార్లు గంజాయి చాక్లెట్లు వ్యవహారం పట్టుబడుతోందా? గత పాలకుల నిర్లక్ష్యమే దీనికి కారణమా? లేటెస్ట్‌గా 13 కిలోల గంజాయి చాక్లెట్లు సీజ్ వెనుక ఏం జరిగింది?
గంజాయి చాక్లెట్స్ గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ బాలానగర్ టీమ్. జగద్గిరిగుట్ట రింగ్ బస్తీలో కిరాణా దుకాణంపై దాడి చేశారు. 61 ప్యాకెట్లలో ఉన్న 2400 (13 కేజీల) గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌లో వీటి విలువ దాదాపుగా లక్షరూపాయలు ఉంటుందని ఓ అంచనా.
గంజాయి చాక్లెట్లకు హైదరాబాద్ అడ్డాగా మారింది. నగరంలో ఏదో ఒక మూలన గంజాయి చాక్లెట్ల విక్రయాలు బయటపడుతున్నాయి. టీ స్టాల్ ముసుగులో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారు. ఈ వ్యవహరంలో బుధవారం ఇద్దర్ని పోలీసులు చేశారు. గురువారం ఓ కిరాణా షాపులో సీక్రెట్‌గా సాగుతున్న గంజాయి చాక్లెట్ల వ్యవహారం రట్టయ్యింది.
హైదరాబాద్ శివారు ప్రాంతమైన జగద్గిరి గుట్టలో ఓ కిరాణాషాపులో భారీగా గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకుంది ఎస్ఓటీ బాలానగర్ టీమ్. షాపు యజమాని సునీల్‌కుమార్ ఝాను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ మొదలుపెట్టారు పోలీసులు.
ALSO READ: కారులో మహిళ ఆత్మహత్య, ఏం జరిగింది?
పట్టుబడిన సునీల్ కుమార్ రెండు దశాబ్దాల కిందట కూలీ పనుల కోసం బీహార్ నుండి వలస వచ్చాడు. బిజినెస్ పెంచాలని ఆలోచన చేశాడు. చివరకు గంజాయి చాక్లెట్లతో యువతను ఆకట్టుకోవడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి సునీల్ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతోంది.
ఒక్కో చాక్లెట్ 40 రూపాయల చొప్పున వలస కార్మికులకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన జగత్‌గిరి గుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో గంజాయి చాక్లెట్లు గురించి ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.