Best family entertainer movies in OTT : ఓటీటీ ప్లాట్ ఫామ్ లో అన్ని రకాల కేటగిరి సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో కొన్ని సినిమాలు కుటుంబం మొత్తం కలసి చూసే విధంగా ఉంటాయి. ఈ సినిమాలను పిల్లలతో చూస్తే ఆ ఎంటర్టైన్మెంట్ మాటల్లో చెప్పలేం. ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న అటువంటి సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హెరాల్డ్ అండ్ ది పర్పుల్ క్రేయాన్ (Harold and the purple crayon)
హెరాల్డ్ అండ్ ది పర్పుల్ క్రేయాన్ మూవీ క్రోకెట్ జాన్సన్ రచించిన పిల్లల పుస్తకం ఆధారంగా జాన్ డేవిస్ నిర్మించారు.ఈ అమెరికన్ ఫాంటసీ కామెడీ మూవీకి కార్లోస్ సల్దాన్హా దర్శకత్వం వహించారు. 2024లో రిలీజ్ అయిన ఈ మూవీలో జాచరీ లెవి, లిల్ రెల్ హౌరీ, బెంజమిన్ బొట్టాని, జెమైన్ క్లెమెంట్, తాన్యా రేనాల్డ్స్, ఆల్ఫ్రెడ్ మోలినా, జూయ్ డెస్చానెల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ జూలై 21,2024న లాస్ ఏంజిల్స్‌లోని కల్వర్ సిటీలో ప్రీమియర్ షో నిర్వహించారు. కొలంబియా పిక్చర్స్ ద్వారా ఆగస్టు 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.ఈ మూవీ జీ 5 (zee5)లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్పెల్‌బౌండ్ (Spell Bound)
స్పెల్‌బౌండ్ మూవీకి జెన్సన్ దర్శకత్వం వహించారు.ఇది ఒక అమెరికన్ యానిమేటెడ్ మ్యూజికల్ అడ్వెంచర్ ఫాంటసీ కామెడీ చిత్రం.స్కైడాన్స్ యానిమేషన్ నిర్మించిన ఈ మూవీలో రాచెల్ జెగ్లర్, జాన్ లిత్‌గో, జెనిఫర్ లూయిస్, టైటస్ బర్గెస్, నాథన్ లేన్, జేవియర్ బార్డెమ్ ప్రధాన పాత్రలు పోషించారు. లుంబ్రియా అని పిలువబడే మాయా ప్రపంచంలో యువరాణి తల్లిదండ్రులు రాక్షసులుగా మారిపోతారు. యువరాణి రాజ్యాన్ని రెండుగా విభజించిన విచ్ఛిన్నం చేయాలని మాన్స్టర్ వెంబడిస్తుంది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ (Netflix),ఆపిల్ టివి (Apple TV) లో స్ట్రీమింగ్ అవుతోంది.
దట్ క్రిస్మస్ (That Christmas)
ఈ బ్రిటీష్ యానిమేటెడ్ క్రిస్మస్ ఫాంటసీ కామెడీ మూవీని లాక్స్మిత్ యానిమేషన్ ద్వారా నిర్మించారు.ఈ మూవీకి సైమన్ ఒట్టో దర్శకత్వం వహించాడు. బ్రియాన్ కాక్స్, ఫియోనా షా, జోడీ విట్టేకర్, బిల్ నైగీ ప్రధాన పాత్రలు పోషించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ మూవీ డిసెంబర్ 4, 2024న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కు వచ్చింది. చిన్న పిల్లలకు గిఫ్ట్లు ఇచ్చే క్రిస్మస్ తాత అనుకోకుండా ఓక తుఫాన్ లో ఇరుక్కుపోతాడు. ఆ తరువాత ఆ తుఫాన్ ను ఎదుర్కొని గిఫ్ట్లు ఇచ్చే విధానం చక్కగా తెరకెక్కించారు మేకర్స్.
ఫ్యామిలీ ప్యాక్ (Family pack)
ఫ్యామిలీ ప్యాక్ అనే ఫ్రెంచ్ అడ్వెంచర్ ఫాంటసీ కామెడీ మూవీకి ఉజాన్ దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ప్యాక్ అడ్వెంచర్ మూవీ 23 అక్టోబర్ 2024న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఒక ఫ్యామిలీ అడ్వెంచర్ గేమ్ ని స్టార్ట్ చేస్తారు. అయితే ఆ గేమ్ ఆడేటప్పుడు వీరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. మధ్యలోనే గేమ్ ఆపేయడం వలన ఈ ఫ్యామిలీ అనుకోని సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ మూవీని చూస్తున్నంత సేపు మూవీ లవర్స్ బాగా ఎంటర్టైన్ అవుతారు.