Ganja Ice Cream Seized: భాగ్యనగరంలో గంజాయి దందా కొత్తపుంతలు తొక్కుతోంది. సరికొత్త పద్దతులలో గంజాయి అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. హోలీ వేళ గంజాయితో తయారు చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్, చాక్లెట్ బాల్స్ ను బహిరంగంగా అమ్ముతూ పోలీసులకు చిక్కారు. ఎస్టీఎఫ్ దాడులలో గంజాయి అమ్మకాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పెద్ద మొత్తంలో గంజాయితో తయారు చేసిన ఐస్ క్రీమ్, చాక్లెట్స్, స్వీట్లను స్వాధీనం చేసుకున్నారు.
హోలీ టార్గెట్ గా గంజాయి విక్రయాలు
హైదరాబాద్ లో హలీ ధూమ్ ధామ్ గా నిర్వహించుకుంటారు. ఉదయం నుంచే ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తారు. బంధు మిత్రులతో కలిసి డ్రమ్స్ దరువులకు అదిరిపోయే స్టెప్స్ వేస్తూ ఆనందిస్తారు. ఇంకొంత మంది సుక్క వేస్తూ, ముక్క తింటూ రంగుల్లో మునిగితేలుతారు. కాస్మోపాలిటన్ సిటీ అయిన హైదరాబాద్ లో.. భిన్న రాష్ట్రాలకు చెందిన ప్రజలు విభిన్న పద్దతుల్లో హోలీ సంబురాలు చేసుకుంటారు.
ఓవైపు హోలీ వేడుకలు జరుగుతుంటే, మరో వైపు డ్రగ్స్ దందాకు తెర తీశారు దుండగులు. లోయర్ ధూల్ పేట మల్చిపురాలో బహిరంగంగానే గంజాయి అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డారు. కుల్ఫీ ఐస్ క్రీమ్, బర్ఫీ స్వీటు, సిల్వర్ కోటెడ్ చాకోలేట్ బాల్స్ రూపంలో గంజాయి అమ్మడం అందరినీ షాక్ కు గురి చేసింది. మరీ ముఖ్యంగా హోలీ వేడుకలు జరిగే ప్రదేశాల్లో పలువురు వీటిని అమ్ముతున్నారనే విషయం ఎస్టిఎఫ్ పోలీసులకు తెలిసింది. ఎస్టిఎఫ్ఏ టీం అంజిరెడ్డి గ్రూపులోని ఎక్సైజ్ పోలీసులు హోలీ సంబురాల్లో గంజాయి అమ్మే ప్రదేశాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడులలో గంజాయితో తయారైన కుల్ఫీ ఐస్ క్రీమ్ లు, బర్ఫీ స్వీట్లు, సిల్వర్ కోటెడ్ చాకోలేట్ బాల్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
Read Also: ప్రియురాలికి నిప్పు పెట్టిన ప్రియుడు, ఆ తర్వాత ఏం జరిగింది.. యూపీలో దారుణం
అసలు సూత్రధారి ఆయనే!
లోయర్ ధూల్ పేట్ కు చెందిన సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తి నిత్యం కుల్ఫీ ఐస్ క్రీమ్ లు అమ్ముతాడు. హోలీ సందర్భంగా గంజాయిని మిక్స్ చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్మకాలు జరుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎస్టిఎఫ్ చీఫ్ అంజిరెడ్డి తెలిపారు. వెంటనే అతడి బండి మీద దాడి చేసి గంజాయితో తయారు చేసిన పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మాదకద్రవ్యాల నిరోధ చట్టంలోని పలు సెక్షన్ల కింద ఆయన మీద కేసులు ఫైల్ చేసినట్లు వెల్లడించారు. ఇలాంటి వాళ్లు ఎక్కడైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ప్రజలను మాదక ద్రవ్యాల వైపు అడుగు పెట్టకుండా చూడటమే తమ బాధ్యత అన్నారు అంజిరెడ్డి.
Read Also: భర్తను చంపేందుకు భార్య స్కెచ్, ఆపై సుపారీ గ్యాంగ్.. చివరకు
Read Also: ఆ మహిళది డ్యూయెల్ రూల్.. ప్రియుడితో కలిసి భర్తకు స్కెచ్ వేసింది