Gauri Spratt: సినీ సెలబ్రిటీలు ప్రేమించి పెళ్లి చేసుకున్నా కూడా కొన్నాళ్ల తర్వాత మనస్పర్థలు ఎక్కువయ్యాయని, కలిసి ఉండలేమని విడాకులు తీసుకోవడం చాలా కామన్‌గా మారిపోయింది. ఒకప్పుడు బాలీవుడ్‌లో మాత్రమే ఈ కల్చర్ ఎక్కువగా కనిపించేది. ఇప్పుడు ప్రతీ భాషా ఇండస్ట్రీలో ఇలాంటి కేసులు చాలానే కనిపిస్తున్నాయి. ఇక బాలీవుడ్‌లో కూడా ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకొని, వారితో విడాకులు తీసుకున్న తర్వాత మళ్లీ ఇంకొకరితో ప్రేమలో పడి వారితో మళ్లీ జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం సీనియర్ హీరో అమీర్ ఖాన్ కూడా అదే బాటను ఫాలో అవుతున్నాడు. తాజాగా తను ప్రస్తుతం డేటింగ్ చేస్తున్న అమ్మాయి గురించి బయటపెట్టాడు.
అక్కడే సెటిల్
ఇటీవల మీడియా వారితో కలిసి ప్రీ బర్త్ డే బ్యాష్‌ను సెలబ్రేట్ చేసుకున్నాడు బాలీవుడ్ సీనియర్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan). అందులో తను ప్రస్తుతం గౌరీ స్ప్రాట్ అనే అమ్మాయితో డేటింగ్‌లో ఉన్నానని ప్రకటించాడు. తనతోనే గత ఏడాదిన్నరగా డేటింగ్‌లో ఉన్నానని చెప్పాడు. దీంతో అసలు ఈ గౌరీ స్ప్రాట్ ఎవరు అని ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలయ్యింది. తన గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారు. గౌరీ తల్లి రీటా స్ప్రాట్ ఒక ఫేమస్ సెలబ్రిటీ స్టైలిస్ట్. తను బెంగుళూరుకు చెందిన అమ్మాయి. బెంగుళూరులో వీరికి ఒక సెలూన్ కూడా ఉంది. తను కూడా తన కుటుంబంతో కలిసి అక్కడే సెటిల్ అయ్యింది. తన తల్లి లాగానే తను కూడా క్రియేటివ్ ఫీల్డ్‌లోనే సెటిల్ అవ్వడానికి ఆసక్తి చూపించింది.
సెలబ్రిటీ స్టైలిస్ట్
గౌరీ స్ప్రాట్ (Gauri Spratt) బ్లూ మౌంటేన్ స్కూల్‌లో చదవును పూర్తి చేసింది. ఆ తర్వాత ఫ్యాషన్ కోర్సు చేసింది. ఆపై లండన్ యూనివర్సిటీలో ఎఫ్‌డీఏ స్టైలింగ్ అండ్ ఫోటోగ్రఫీలో కోర్సు పూర్తి చేసింది. గౌరీ స్ప్రాట్ కూడా తన తల్లిలాగానే ముంబాయ్‌లో ఒక సెలూన్ నడుపుతుంది. దాని పేరే బీబ్లంట్. తను కూడా తన తల్లిలాగానే సెలబ్రిటీ స్టైలిస్ట్‌లాగా సెటిల్ అయిపోయింది. చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు తన క్లైంట్స్. అంతే కాకుండా అమీర్ ఖాన్ ఏర్పాటు చేసిన నిర్మాణ సంస్థలో గౌరీ కొంతకాలంగా అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. అంతే కాకుండా అమీర్‌తో తనకు 25 ఏళ్ల నుండి ఫ్రెండ్‌షిప్ ఉంది. అయితే అమీర్, గౌరీ డేటింగ్‌లో ఉన్న విషయం ఇప్పటివరకు మీడియాలో బయటికి రాలేదు. దానిపై కూడా అమీర్ స్పందించాడు.
Also Read: తప్పు చేశాను క్షమించండి.. బహిరంగ వీడియో రిలీజ్ చేసిన సురేఖ వాణి కూతురు సుప్రిత
అందుకే బయటపడలేదు
ఒకవేళ గౌరీ ముంబాయ్‌లో ఉండుంటే అమీర్‌తో తన డేటింగ్ విషయం ఇప్పటికే బయటపడేదేమో. కానీ తను బెంగుళూరులో ఉంటుందని, తనను కలవడానికే తానే అక్కడికి వెళ్తుంటానని బయటపెట్టాడు అమీర్ ఖాన్. అక్కడ మీడియా అటెన్షన్ తక్కువగా ఉంటుంది కాబట్టి వారి డేటింగ్ విషయం బయటపడలేదని అన్నాడు. గౌరీ హిందీ సినిమాలు చాలా తక్కువగా చూస్తుందని, తను పాడే పాటలంటే తనకు ఇష్టమని, వీలైనప్పుడు తనకోసం పాటలు పాడుతుంటానని చెప్పుకొచ్చాడు అమీర్ ఖాన్. ఇప్పటికే తన కుటుంబ సభ్యులకు కూడా గౌరీ స్ప్రాట్ గురించి తెలుసని తెలిపాడు. గౌరీకి కూడా ఇంతకు ముందే పెళ్లయ్యింది. తనకు ప్రస్తుతం ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.