Kolkata Crime News: అరచేతిలోకి స్మార్ట్‌ఫోన్ వచ్చాక వింతలు, విశేషాలకు కొదవలేదు. వాటిని మంచికి ఉపయోగిస్తే పర్వాలేదు. తేడా వస్తే అడ్డంగా బుక్కైపోతాము. ఈ విషయంలో ఆ మహిళకు అదే జరిగింది. పోలీసులకు చిక్కింది. చివరకు ఆ మహిళ బండారం మొత్తం బయటపడింది. ఆమె గురించి తెలిసి షాకయ్యారు పోలీసులు. అసలు ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
పైన కనిపిస్తున్న మహిళ పేరు పూజా సర్దార్, ఓ ఇంట్లో పని చేస్తోంది. ఆ ఇంటికి కన్నం వేసింది. ఇందులో కొత్తధనం ఏముందని అనుకున్నారా? కోల్‌కతా సిటీ సమీపంలోని మధ్యమ్‌గ్రామ్ ప్రాంతంలో ఈ వ్యవహారం వెలుగుచూసింది. అశిష్‌దాస్ గుప్తా అనే మాజీ ప్రభుత్వోద్యోగి ఇంట్లో గతేడాది చోరి జరిగింది.
ఇంట్లోని గాజులు, చెవి దుద్దులు, బంగారు గొలుసు, చీరలును దొంగలు ఎత్తుకుపోయారు. దీనిపై బాధితులు సమీపంలోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇంట్లో పని చేస్తున్న పూజాపై వారికి అనుమానం వచ్చింది. కాకపోతే ఆమె దొంగతనం చేసిందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. దీంతో అశిష్‌దాస్ ఫ్యామిలీ సైలెంట్ అయిపోయింది.
ఈ వ్యవహారాన్ని ఎప్పటికప్పుడు గమనించిన పూజా, తనపై ఓనర్‌కు అనుమానం వచ్చిందని గుర్తించింది. పని చేస్తున్న ఇంట్లో ఏ మాత్రం చెప్పకుండా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యింది. ఒకటి రెండు కాదు.. ఇలా ఐదారు ఇళ్లులో చేసింది పూజా. ఆ ప్రాంతంలో వరుసగా చోరీలు జరగడంపై పోలీసులు అటువైపు దృష్టి పెట్టారు.
ALSO READ: ప్రేమ జంట కనిపిస్తే చాలు.. ఆ కానిస్టేబుల్ అరాచకాలు
దొంగలించిన బనారస్ చీర ధరించి ఫోటోలు తీసుకుని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. పూజా ఫోటోలు వైరల్ అయ్యాయి. చివరకు ఓ రోజు ఆశిష్‌దాస్ కూతురు ఫేస్‌బుక్ చూస్తోంది. అదే సమయంలో పూజా సర్దార్ ఫోటోలు కనిపించాయి. తమ ఇంట్లో దొంగిలించిన చీరతో పూజా కనిపించింది. ఆమె కట్టుకున్న చీర తమదేని గుర్తించింది.
వెంటనే ఆ ఫొటోను స్క్రీన్ షాట్ తీసి పేరెంట్స్‌కి చెప్పింది. వెంటనే ఈ విషయాన్ని అశిష్‌దాస్ గుప్తా ఫ్యామిలీ సభ్యులు పోలీసులకు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు, వలపన్ని పూజను అదుపులోకి తీసుకున్నారు. తాను దొంగతనం చేయలేదంటూ బుకాయించే ప్రయత్నం చేసింది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయాలు బయటపెట్టింది. మొత్తానికి ఫేస్‌బుక్ ద్వారా పూజా ఆ విధంగా బుక్కయ్యింది.