Ajith Kumar: తమిళ స్టార్ హీరోలలో ఒకరిగా పేరు తెచ్చుకున్న అజిత్ తన కొత్త మూవీ కి సంబంధించి అప్డేట్ అధికారికంగా ప్రకటించారు. ఈమధ్యనే గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అజిత్.. త్వరలోనే తన కొత్త సినిమా షూటింగ్ కూడా లో కూడా పాల్గొనబోతున్నారు. మరి ఇంతకీ అజిత్ కొత్త సినిమా షూటింగ్ ఎప్పటినుండి స్టార్ట్ కాబోతుంది..? అజిత్ నటిస్తున్న సినిమాకి డైరెక్టర్ గా ఎవరు చేస్తున్నారు..? అనేది ఇప్పుడు చూద్దాం..ఓవైపు కార్ రేసర్ గా.. మరోవైపు హీరోగా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నారు తమిళ హీరో అజిత్.. ఈయన రీసెంట్ గా గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీతో ప్రేక్షకులను పలకరించారు.
అజిత్ కొత్త మూవీ మొత్తం ఫిక్స్..
ఇక ఈ సినిమా చూసిన చాలామంది అజిత్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ దొరికినట్టు అయింది.ఈ సినిమా చూసిన ఫ్యాన్స్ అజిత్ ఈజ్ కం బ్యాక్ అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. అయితే ఓవైపు కార్ రేసింగ్ చేస్తూనే సినిమాలు చేస్తున్న అజిత్ తాజాగా తన కొత్త సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అజిత్ తన కొత్త సినిమా AK64 నవంబర్లో షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుంది అంటూ గుడ్ న్యూస్ చెప్పారు. అంతేకాదు AK 64 సినిమాకి దర్శకుడిగా అధిక్ రవిచంద్రన్ చేస్తున్నట్టు కూడా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. ఇక అజిత్ ఆఫీషియల్ అనౌన్స్మెంట్ తో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
AK 64 మూవీపై అజిత్ క్లారిటీ..
ఆ ఇంటర్వ్యూలో అజిత్ మాట్లాడుతూ.. నేను నా కొత్త సినిమాని నవంబర్లో స్టార్ట్ చేస్తాను. నవంబర్ నుండి ఫిబ్రవరిలోపు నా సినిమా పూర్తి అయితే మళ్లీ కార్ రేసింగ్ లో పాల్గొనవచ్చు.అందుకే ఇలా షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నాను. ఇక AK 64 మూవీ 2026 ఏప్రిల్ లేదా మేలో విడుదలవుతుంది. అయితే జనవరి దుబాయ్ లో కార్ రేసింగ్ స్టార్ట్ అవ్వబోతుంది.ఆ కార్ రేసింగ్ లో నేను కచ్చితంగా పాల్గొనాలి. అందుకే నా సినిమా షూటింగ్ నవంబర్ నుండి ఫిబ్రవరి మధ్యలో పూర్తి చేస్తే జనవరిలో నేను రేసింగ్ లో పాల్గొనవచ్చు. అలాగే మార్చి నుండి అక్టోబర్ లో యూరప్ లో మరో కార్ రేసింగ్ పూర్తవుతుంది అంటూ చెప్పుకోచ్చారు.అలా ఓవైపు కార్ రేసింగ్ లో పాల్గొంటూనే మరోవైపు సినిమాలను కూడా చేస్తున్నారు. ఇక అజిత్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 33 సంవత్సరాలు అవుతుంది.ఆయన సినిమా ఇండస్ట్రీకి చేసిన కృషికి గానూ ఆయనకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అంతేకాదు ఈ కార్ రేసింగ్ కారణంగా ఆయన ఎన్నోసార్లు ఆక్సిడెంట్ కి కూడా గురయ్యారు. అయినా సరే పట్టు విడవని విక్రమార్కుల్లా తనలోని టాలెంటును, అభిరుచిని ఎప్పటికప్పుడు అభిమానులకు రుచి చూపిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అజిత్.
Anasuya : అనసూయలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఇదెప్పుడూ సూడలే? నువ్వు గ్రేట్ అక్క!