Collagen Rich Foods: వయస్సు పెరిగే కొద్దీ చర్మం నిర్జీవంగా మారడం ప్రారంభమవుతుంది. శరీరంలో కొల్లాజెన్ లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది. కొల్లాజెన్ అనేది ఒక రకమైన ప్రోటీన్. ఇది మన చర్మం, జుట్టు మొత్తం ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. మన చర్మంలో 70 శాతం కొల్లాజెన్‌తో తయారవుతుంది. శరీరం మొత్తం 30 శాతం కొల్లాజెన్ తో తయారవుతుంది. ఇది మన చర్మాన్ని బిగుతుగా ఉంచడానికి, కీళ్లను బలోపేతం చేయడానికి అంతే కాకుండా కండరాలను కలిసి ఉంచడానికి పనిచేసే పదార్థం. కానీ శరీరంలో కొల్లాజెన్ పరిమాణం తగ్గడం ప్రారంభించినప్పుడు.. చర్మం వదులుగా మారడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా చర్మంపై ముడతలు కనిపించడం ప్రారంభమవుతుంది. అందుకే.. చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి కొల్లాజెన్ అత్యంత అవసరమైన పోషకం. కానీ వయస్సు పెరిగే కొద్దీ కొల్లాజెన్ అంత త్వరగా ఉత్పత్తి కాదు. ఇలాంటి పరిస్థితిలో కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం మంచిది. వీటిలో కొల్లాజెన్ సమృద్ధిగా లభిస్తుంది.
ఉసిరి:
ఇందులో విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లకు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఉసిరి చర్మంలోని మృత కణాలను తొలగించి.. కొల్లాజెన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. కాబట్టి, ఉసిరిని క్రమం తప్పకుండా తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఉసిరిని తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
శనగలు:
గ్లైసిన్ అనే అమైనో ఆమ్లం శనగల్లో పుష్కలంగా లభిస్తుంది. ఇది చర్మంలో కొల్లాజెన్ అనే ప్రోటీన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది చర్మంపై ఉన్న సన్నని గీతలను కూడా తొలగిస్తుంది. మీరు సాయంత్రం వేళల్లో కాల్చిన శనగలు తినడం వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.
కోకో:
ఇది రాగి, యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. కోకో మీ చర్మానికి కలిగే నష్టాన్ని సరిచేయడమే కాకుండా దానిని రక్షించడంలో కూడా సహాయపడుతుంది. దీంతో పాటు.. ఇది అకాల వృద్ధాప్య లక్షణాలను కూడా తగ్గిస్తుంది. కోకో తినడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది.
పుట్టగొడుగు:
పుట్టగొడుగులలో కొల్లాజెన్ ఉంటుంది. ఇది చర్మంలో కొల్లాజెన్‌ను పెంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా.. ఇది చర్మంపై ముడతలు, గీతలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. మీరు పుట్టగొడుగులను మీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక లాభాలు ఉంటాయి.
నారింజ:
ఉసిరి లాగానే, విటమిన్ సి కూడా నారింజ పండ్లలో పుష్కలంగా లభిస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి అవసరమైన హైలురోనిక్ ఆమ్లాన్ని ప్రోత్సహిస్తుంది. అందుకే మీరు పండ్లలో నారింజను ఎక్కువగా తినాలి. ఇది చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
Also Read: మోకాళ్ల వరకు జుట్టు పెరగాలా ? అయితే ఈ టిప్స్ ట్రై చేయండి
అనాస పండు:
ఇందులో విటమిన్ సి చాలా మంచి పరిమాణంలో ఉంటుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది కణాలు, కణజాలాలను మరమ్మతు చేయడంలో సహాయపడుతుంది.
జీడిపప్పు:
జింక్ , రాగి వంటి ముఖ్యమైన పోషకాలు జీడిపప్పులో ఉంటాయి. అందుకే ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో , శరీరంలో కొల్లాజెన్ సామర్థ్యాన్ని పెంచడంలో సహాయపడుతుంది. జీడిపప్పు తినడం వల్ల చర్మంపై ముడతలు రాకుండా ఉంటాయి.