E-Paper
Advertisement

Social Media Influencer Murder: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ హత్య, నిందితుడి కోసం గాలింపు

Social Media Influencer Murder: సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ హత్య, నిందితుడి కోసం గాలింపు
Advertisement

Social Media Influencer Murder:  కెనడాలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇండియా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ గ్రెవాల్‌ను గుర్తు తెలియని దుండగలు కత్తితో పొడిచి పొడిచి చంపారు. వెంటనే ఆమెని ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టారు. ఈ ఘటనపై దర్యాప్తు వేగవంతం చేశారు కెనడా పోలీసులు.

కెనడాలో దారుణం..  సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ హత్య

Advertisement

కెనడాలో నివాసం ఉంటోంది భారతీయ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నాన్సీ గ్రేవాల్. గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో దారుణహత్యకు గురయ్యారు. కెనడాలోని లాసల్లె ఈ ఘటన జరిగింది. పంజాబీ మూలానికి చెందిన 45 ఏళ్ల నాన్సీ, సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటోంది. ప్రస్తుతం పంజాబ్‌లో జరుగుతున్న పరిణామాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు.

ఖలిస్తానీలను తీవ్రంగా విమర్శిస్తూ బాగా పాపులర్‌ అయ్యారు. అయితే నాన్సీ గ్రేవాల్ హత్యతో కెనడాలోని భారతీయుల్లో కలకలం మొదలైంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 12 వేల మందికి పైగా ఫాలోవర్స్ వున్నారు. కేవలం వినోదం కోసం వీడియోలు చేయడమే కాకుండా, పంజాబ్ రాజకీయాలు, భారత్-కెనడా మధ్య సంక్లిష్ట సంబంధాలతో బహిరంగంగా మాట్లాడారు.

Advertisement

నిందితుడి కోసం గాలింపు.. ఎలా జరిగింది?

కెనడాలోని లాసల్లే సిటీలో టాడ్ లేన్ ప్రాంతంలో ఆమె నివాసం ఉంటున్నారు. మార్చి 3 అనగా మంగళవారం రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమెని కత్తితో పలుమార్లు పొడిచాడు. తీవ్రగాయాలు కావడతో ఇరుగుపొరుగు వారు వెంటనే ఆమెని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నాన్సీ మరణించారు.

రాజకీయ అంశాలపై నాన్సీ గ్రెవాల్‌ చాలా ఓపెన్ గా మాట్లాడేవారు. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద అంశాలపై స్పందించేవారు. భారత్-కెనడాల ఉద్రిక్తతల నేపథ్యంలో ఖలిస్తానీ సానుభూతిపరుల వ్యాఖ్యలను బహిరంగంగా ఖండించేవారు. అకాలీదళ్ నాయకత్వం, బిక్రమ్ సింగ్‌పై తరచుగా విమర్శలు చేసేవారు.

ALSO READ: ఎంత పని చేసావు చిన్నా.. సెల్‌ఫోన్ వాడొద్దన్నందుకు తరగతి గదిలో..

జైలులో ఉన్న ఎంపీ అమృత్‌పాల్ సింగ్, డేరా బియాస్ అధిపతి గురీందర్ సింగ్ ధిల్లాన్‌కు వ్యతిరేకంగా ఆమె వ్యాఖ్యలు చేశారు. గతేడాది జూన్‌లో భటిండాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన మరో ఇన్‌ఫ్లుయెన్సర్ కాంచన్ కుమారి మరణంపై కూడా గళమెత్తారు.  నాన్సీ గ్రేవాల్ కేసును కెనడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టాడ్ లేన్ పరిసర ప్రాంతాల ప్రజలు తమ ఇంటి వద్దనున్న సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని కోరారు. ప్రస్తుతానికి నిందితుడి ఆచూకీ లభించలేదు. ఎవరికైనా సమాచారం తెలిస్తే క్రైమ్ స్టాపర్స్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×