E-Paper
Advertisement

Ysrcp : హత్యా రాజకీయాలపై ‘అంబటి’ సూక్తులు.. మరి మీరు చేసిందేంటి?

Ysrcp : హత్యా రాజకీయాలపై ‘అంబటి’ సూక్తులు.. మరి మీరు చేసిందేంటి?
Advertisement

ఏపీలో హత్యారాజకీయాలను సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేశ్ ప్రోత్సహిస్తున్నారని మాజీ మంత్రి,వైసీసీ సీనియర్ నేత అంబటి రాంబాబు అన్నారు.రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారని, ఇదేక్కడి రాజకీయమని విమర్శలు సంధించారు.విశాఖలో కాపు నేతల బ్రేక్ ఫాస్ట్ సమావేశానికి హాజరైన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.గుంటూరులో తన ఇంటిపై జరిగిన దాడిలో తన హత్యకు కుట్ర పన్నారని,దీనిని సీఎం చంద్రబాబు, నారాలోకేశ్ దగ్గరుండి మానిటర్ చేశారని చెప్పుకొచ్చారు.ఇదిలాఉండగా, వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో టీడీపీ నేతలపై జరిగిన దాడులపై ఆయన ఏం సమాధానం ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.

టీడీపీ నేతల హత్యలు..

వైసీపీ హయాంలో పలువురు టీడీపీ నేతలు, ఇన్‌చార్జులు హత్యలకు గురైన విషయం తెలిసిందే.వైసీపీ గూండాలు హత్య చేశారని టీడీపీ నేతలు నాడు ఎంత వాదించినా, పోలీసులకు ఫిర్యాదులు చేసినా పెద్దగా చర్యలు లేవు. ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు కుటుంబాన్ని ఎంతగా అవమానించినా, దాడులకు తెగబడినా నాడు ఎటువంటి చర్యలు తీసుకోలేదని హితవు పలుకుతున్నారు. అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలుు చేయకపోతే, పార్టీ కార్యకర్తలు, నాయకుల మనోభావాలు దెబ్బతీయకపోతే అలాంటి పరిస్థితి వచ్చేదా? అని ప్రశ్నిస్తున్నారు.

హత్యారాజకీయాలు వైసీపీకి కొత్తేమీ కాదు..

Advertisement

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అంతకుముందు సైతం హత్యారాజకీయాలు చేసిందని టీడీపీ నేతలు చెబుతున్నారు.2019 ఎన్నికల ముందు వైఎస్ జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను గుర్తుచేస్తున్నారు. సొంత బాబాయ్ హత్య జరిగాక అధికారంలోకి వచ్చిన వైసీపీ నిందితులను పట్టుకున్నదా? అని ప్రశ్నిస్తున్నారు. వివేకా కూతురు విజ్ఞప్తి మేరకు సీబీఐ విచారణ జరిగినా.. కీలక నిందితులు తప్పించుకున్నారని, మరికొందరు హత్యగావింపబడ్డారని గుర్తుచేస్తున్నారు.దీనివెనుక ఎవరి హస్తం ఉందని, వైఎస్ జగన్ ఇందులో పాత్రధారులు, సూత్రధారులు కాదా? అని అడుగుతున్నారు.నిజంగానే జగన్ హస్తం లేకపోతే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు నిందితులను ప్రజల ముందు ప్రవేశపెట్టలేదని నిలదీస్తున్నారు.

Uttam Kumar Reddy: తెలంగాణలో భూసేకరణకు ప్రభుత్వం 500 కోట్లు విడుదల

Advertisement

వైసీపీ మాజీ మంత్రులు, నేతలు ప్రజల మీద దౌర్జన్యం చేశారని, అందినకాడికి దోచుకున్నారని, అవినీతి, అక్రమాలకు పాల్పడంతో పాటు ప్రశ్నించిన వారిపై దాడులు తెగబడ్డారని, దీనికి సంబంధించిన ఆధారాలు పోలీస్ స్టేషన్లలో కేసుల రూపంలో ఆనాడు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని అంటున్నారు. కూటమి సర్కార్ కేవలం రాజ్యంగా ఉల్లంఘన, ప్రజలు, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించిన వారి మీదనే చట్టప్రకారం చర్యలకు ఉపక్రమిస్తున్నదని, కక్షపూరిత రాజకీయాలు చేయాలంటే మాజీ సీఎం దగ్గర నుంచి మాజీ మంత్రులు ఎవరూ ఇప్పుడు అంత స్వేచ్ఛగా బయట తిరగరని స్పష్టంచేస్తున్నారు. ఈ విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుకు ఉంచుకోవాలని హితవు పలుకుతున్నారు. ఇంకోసారి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించుకోవాలని హెచ్చరికలు పంపారు.

 

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×