E-Paper
Advertisement

Student Suicide: ఎంత పని చేసావు చిన్నా.. సెల్‌ఫోన్ వాడొద్దన్నందుకు తరగతి గదిలో..

Student Suicide: ఎంత పని చేసావు చిన్నా.. సెల్‌ఫోన్ వాడొద్దన్నందుకు తరగతి గదిలో..
Advertisement

Student Suicide: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇందల్వాయిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలానికి చెందిన విద్యార్థిగా పోలీసులు గుర్తించారు.

పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా సదరు విద్యార్థి తన వద్ద సెల్ ఫోన్ ఉంచుకున్నట్లు తెలిసింది. హాస్టల్ తనిఖీల్లో భాగంగా విద్యార్థి వద్ద మొబైల్ ఫోన్ ఉండటాన్ని గమనించిన ఉపాధ్యాయుడు అతడిని మందలించారు. చదువుకోవాల్సిన వయసులో ఫోన్లు ఎందుకని, క్రమశిక్షణతో ఉండాలని టీచర్ వారించినట్లు సమాచారం. అయితే, ఉపాధ్యాయుడి మందలింపును సదరు విద్యార్థి తీవ్రంగా పరిగణించి, తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

Advertisement

మనస్తాపం చెందిన విద్యార్థి తన గదిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తోటి విద్యార్థులు గమనించి పాఠశాల సిబ్బందికి సమాచారం అందించగా, వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చదువుకుని ప్రయోజకుడు కావాల్సిన బాలుడు, చిన్న కారణానికే ప్రాణాలు తీసుకోవడం తోటి విద్యార్థులను, ఉపాధ్యాయులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Also Read: సమాజమా.. ఎటు పోతున్నావు? సొంత చెల్లెలిపైనే కన్నేసిన కామాంధుడు!

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×