BigTV English

TDP Counter to YSRCP: అప్పట్లో ఏం జరిగింది..? బయటకొస్తున్న పాత వీడియోలు

TDP Counter to YSRCP: అప్పట్లో ఏం జరిగింది..? బయటకొస్తున్న పాత వీడియోలు

పోలీసులపై జగన్ చేసిన వ్యాఖ్యలు, వాటికి కౌంటర్ గా ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యలు.. ఇలా ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఆగేలా లేదు. టీడీపీ నేతలు కూడా గతంలో వైసీపీ వాళ్లు చేసిన దారుణమైన వ్యాఖ్యల్ని బయటకు తీస్తున్నారు. ఆనాడు అసెంబ్లీలోనే మహిళలపై దారుణ వ్యాఖ్యలు చేసిన వారిని ఈరోజు ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు.


ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యల్ని పార్టీలకతీతంగా అందరూ ఖండించారు. అతను క్షమాపణ వీడియో వెంటనే విడుదల చేసినా అప్పటికే తప్పు జరిగింది కాబట్టి, టీడీపీ కూడా ఆ తప్పుని ఉపేక్షించలేదు. పార్టీనుంచి సస్పెండ్ చేయడమే కాకుండా పోలీస్ కేసు కూడా పెట్టాలని స్వయంగా పార్టీయే ఫిర్యాదు చేయడం ఇక్కడ విశేషం. దీంతో ఇప్పుడు బంతి టీడీపీ కోర్టులోకి వచ్చినట్టయింది. తమ చిత్తశుద్ధి ఏంటో చూశారుగా అంటూ టీడీపీ నేతలు తిరిగి వైసీపీని టార్గెట్ చేస్తున్నారు. ఇదే పని వైసీపీలో ఎవరైనా చేసి ఉంటే.. వారికి జగన్ సలహాదారు పదవో లేక సోషల్ మీడియా ఇన్ చార్జ్ పదవో, మంత్రి పదవో ఇచ్చి ఉండేవారని అంటున్నారు టీడీపీ

సోషల్ మీడియాలో అలజడి..
ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ వ్యవహారంతో సోషల్ మీడియా అట్టుడికిపోతోంది. కిరణ్ మాటల్ని ఎవరూ సమర్థించడం లేదు కానీ, అదే సమయంలో గతంలో వైసీపీ నేతలు చేసిన దారుణ వ్యాఖ్యల్ని అప్పట్లో ఎవరూ ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీస్తున్నారు టీడీపీ నేతలు. వారిపై ఇప్పటి వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. కనీసం అప్పట్లో వైసీపీ నేతలెవరూ ఆ మాటల్ని ఖండించలేదని చెబుతున్నారు.

శ్రీరెడ్డి, బోరుగడ్డకంటే ఎక్కువా..?
గతంలో శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్ చేసిన వ్యాఖ్యల్ని ఇప్పుడు చాలామంది హైలైట్ చేస్తున్నారు. అప్పట్లో చంద్రబాబు, లోకేష్ ని శ్రీరెడ్డి బండబూతులు తిట్టేది. ఆ తర్వాత తీరిగ్గా క్షమాపణలు చెప్పింది. శ్రీరెడ్డిపై ఎవరూ కేసు పెట్టలేదు, ఆమె మాటల్ని కనీసం వైసీపీ నుంచి ఎవరూ ఖండించలేదు. ఇక బోరుగడ్డ అనిల్ వ్యాఖ్యలపై వైసీపీలో ఏ ఒక్కరూ స్పందించకపోవడం విశేషం. అలాంటి వాళ్లని ఎంకరేజ్ చేసి మరీ టీడీపీ నేతల్ని టార్గెట్ చేశారని, ఇప్పుడు తప్పు చేసిన టీడీపీ కార్యకర్తని పార్టీనుంచి సస్పెండ్ చేశామని, అదీ తమ పార్టీ చిత్తశుద్ధి అని అంటున్నారు.


జైలుకెళ్లి కలిసొచ్చారుకదా..!
చేబ్రోలు కిరణ్ మాటల్ని ఖండించిన వారు, అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నవారు గతంలో పోసాని కృష్ణమురళి, వల్లభనేని వంశీ మాట్లాడిన మాటల్ని సమర్థిస్తారా అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వల్లభనేని వంశీని స్వయంగా జగన్ జైలుకెళ్లి మరీ పరామర్శించారు. పోసాని కోసం ఏకంగా లాయర్ ని పెట్టి వాదనలు నడిపించారు. అలాంటి వారిని వెనకేసుకొచ్చిన జగన్ కి, ఆయన పార్టీకి ఇప్పుడు నొప్పి తెలుస్తుందా అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు.

“కిరణ్ తప్పు చేశాడు, మేం పార్టీనుంచి సస్పెండ్ చేశాం, పోలీస్ కేసు కూడా పెట్టాం.” కానీ గతంలో అంతకంటే దారుణంగా మాట్లాడిన వారిపై వైసీపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×