Sudiksha Konanki Missing: మార్చి 6న డొమనికన్ రిపబ్లిక్ మిస్సైన భారత సంతతి విద్యార్ధిని సుదీక్ష కోణంకి.. మిస్సింగ్ కేసు ఇంకా సస్పెన్స్‌గానే కొనసాగుతోంది. కొంతమేర పురోగతి సాధించినప్పటికీ.. పూర్తి వివరాలు తెలియరాలేదు. తన ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో బీచ్ వద్ద ఉన్న లాంజ్ చైర్‌పై ఆమె ధరించిన తెల్లటి దుస్తులతో పాటు, పాదరక్షలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
సుదీక్ష దుస్తులు కొన్ని మట్టిలో కూరుకుపోయినట్లు గుర్తించారు. ఆమే నీటిలోకి వెళ్లేటప్పుడు దుస్తులను వదిలి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఆమె చివరిసారిగా ధరించిన బట్టలు ప్రస్తుతం వీటితో సరిపోలాయి. సీసీ కెమరా పరిశీలించగా.. సుదీక్ష తన ఫ్రెండ్స్‌తో కలిసి 6వ తేదీన మూడు గంటల సమయంలో ఓ రిసార్ట్‌లో పార్టీ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
కాగా అమెరికా పిట్స్ బర్గ్ యూనివర్శిటీలో చదువుతున్న 20 ఏళ్ల సుదీక్ష కోణంకి(Sudiksha Konanki) ఇటీవల తన ఫ్రెండ్స్‌తో కలిసి డొమినికన్ రిపబ్లిక్‌లోని.. ప్రముఖ పర్యటక ప్రాంతమైన వ్యూంటా కానా ప్రదేశానికి వెళ్లిన సంగతి తెలిసిందే. చివరిసారిగా ఈనెల 6న స్థానికంగా ఉన్న రియారిపబ్లికా రిసార్ట్ బీచ్ వద్ద కనిపించింది. ఆ తర్వాత సుదీక్ష తిరిగి తన రూమ్‌కి రాకపోవడంతో ఆమె స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు ఆమె కోసం ఈ కేసును ఛాలెంజింగ్‌గా తీసుకుని విచారిస్తున్నారు.
Also Read: మధ్యప్రదేశ్‌లో దారుణం.. క్రైమ్ షోలు చూసి భార్యను చంపేశాడు
సముద్రంలోనే స్నానానికి వెళ్లే ముందు ఆ దుస్తులను, చెప్పులను వదిలేసి వెళ్లి ఉంటుంది.. ఈ నేపథ్యంలోనే తాను సముద్రంలో మునిగిపోయిందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే 24 సంవత్సరాల వయసున్న జాషువా స్టీఫెన్‌తో కలిసి సుదీక్ష బీచ్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దీంతీ పోలీసులు అతన్ని ప్రశ్నించగా పొంతన లేని సమాధానం చెబుతున్నాడు. తమ కుమార్తెను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ కోణంలో కూడా దర్యాప్తు చేపట్టాలని పోలీసులను అభ్యర్ధించారు. ఈ ఈనేపథ్యంలోనే ఆమె దుస్తులు బీచ్ వద్ద కనిపించాయి.