E-Paper
Advertisement

Indore Police Suspension: విచారణకు వచ్చి నగలు కొట్టేసిన పోలీసులు.. పట్టించిన సీసీ కెమెరా

Indore Police Suspension: విచారణకు వచ్చి నగలు కొట్టేసిన పోలీసులు.. పట్టించిన సీసీ కెమెరా
Advertisement

Indore Police Suspension: మధ్యప్రదేశ్ ఇండోర్ లో పోలీసులే దొంగలయ్యారు. ఓ కేసు విచారణలో నగల వ్యాపారి ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఇంట్లోకి చొరపడి, సీసీ కెమెరాలు ఆఫ్ చేసి 20 తులాల బంగారం చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు.. ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.

ఇండోర్‌లో ఒక ఇంట్లోకి చొరబడి, ఓనర్స్ తో దురుసుగా ప్రవర్తించి, బంగారు ఆభరణాలు దొంగిలించిన ఆరోపణలపై ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఏప్రిల్ 1వ తేదీ రాత్రి ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ చేపట్టారు. బాధితుడు ఫిర్యాదుతో విచారణ చేపట్టిన ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసినట్లు ఇండోర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్ 2) కుమార్ ప్రతీక్ తెలిపారు.

చెక్ బౌన్స్ కేసులో

Advertisement

ఏప్రిల్ 1వ తేదీ రాత్రి ఆరుగురు పోలీసులు చెక్ బౌన్స్ కేసులో గౌరవ్ జైన్ అనే బంగారం వ్యాపారి ఇంటికి వెళ్లారు. తలుపులు పగలగొట్టి బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి, ఇంట్లోని వారితో దురుసుగా ప్రవర్తించారు. తనిఖీల పేరిట ఇంట్లో చెక్ చేసిన పోలీసులు 20 తులాల బంగారం చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఉన్నతాధికారులు శాఖాపరమైన విచారణ జరిపారు. ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసినట్లు డీసీపీ తెలిపారు.

రూ.35 లక్షల విలువైన బంగారం చోరీ

Advertisement

ఈ కేసును విజయ్‌నగర్ ఏసీపీ దర్యాప్తు చేస్తున్నారని, విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటారని డీసీపీ తెలిపారు. రిటైర్డ్ ఏసీపీ రాకేష్ గుప్తాతో ఆర్థిక వివాదంతో సంబంధం ఉన్న గౌరవ్ జైన్ అనే నగల వ్యాపారి చెక్ బౌన్స్ కేసులో వారెంట్‌ ను ఇచ్చేందుకు పోలీసులు అతడి ఇంటికి వెళ్లారు. ఈ ఘటనలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, ఐదుగురు పోలీసులు బంగారం వ్యాపారి ఇంట్లోకి చొరబడి సుమారు రూ. 35 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. నగలు చోరీ చేసిన వారిలో అదనపు పోలీస్ కమిషనర్ అమరేంద్ర సింగ్, సబ్-ఇన్‌స్పెక్టర్ సంజయ్ బిష్ణోయ్, హెడ్ కానిస్టేబుళ్లు ప్రవీణ్ భదోరియా, దినేష్ జాట్, రవీంద్ర ఖుష్వా ఉన్నారు.

ఈ ఘటనలో దాదాపు 20 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని గౌరవ్ జైన్ ఆరోపించారు. వారెంట్ లేకుండా ఇంట్లోకి దొంగల్లా ప్రవేశించి దాడి చేశారని, బంగారం చోరీ చేశారని అతడు ఆరోపించారు.

Also Read: పని చేస్తున్న ఇంటికే కన్నం వేసిన మహిళ.. 9.5 తులాల బంగారంతో జంప్..!

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×