E-Paper
Advertisement

Gold Theft Case: పని చేస్తున్న ఇంటికే కన్నం వేసిన మహిళ.. 9.5 తులాల బంగారంతో జంప్..!

Gold Theft Case: పని చేస్తున్న ఇంటికే కన్నం వేసిన మహిళ.. 9.5 తులాల బంగారంతో జంప్..!
Advertisement

Gold Theft Case: వ్యాపారంలో వచ్చిన నష్టాలను పూడ్చుకోవటానికి పని చేస్తున్న ఇంటికే కన్నం వేసిన మహిళను ఉస్మానియా వర్సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలి నుంచి 9.5తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఏసీపీ జగన్ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం కొండవాగుల గ్రామానికి చెందిన అల్లం తేజస్వి (43), సుదర్శన్ భార్యాభర్తలు. గతంలో తేజస్వి కిరాణా షాపు నడిపించింది.

కేర్​ టేకర్​ గా చేరి..

అయితే, వ్యాపారం సరిగ్గా జరగక నష్టాల పాలైంది. దాంతో భార్యాభర్తలు హైదరాబాద్ వచ్చి బడంగ్ పేట ప్రాంతంలోని మల్ రెడ్డి నగర్ లో స్థిరపడ్డారు. 2025, జూన్ లో సునీత అనే మహిళ ద్వారా తేజస్వి హబ్సీగూడలో ఉంటున్న రిటైర్డ్ సైంటిస్ట్ డాక్టర్ రావు ఇంట్లో నెలకు 18వేల రూపాయల జీతానికి కేర్​ టేకర్​ గా చేరింది. డాక్టర్ రావు దంపతుల నమ్మకాన్ని సంపాదించిన తరువాత తేజస్వి గత అక్టోబర్ నుంచి చేతివాటాన్ని ప్రదర్శించటం మొదలు పెట్టింది. బెడ్ రూం శుభ్రం చేస్తున్నట్టుగా నటిస్తూ వేర్వేరు సార్లు బీరువాలో ఉన్న బంగారు గొలుసులు, గాజులు, ఉంగరాలు, చంద్రహారాన్ని తస్కరించింది.

Advertisement

Also Read: Nani Aaya Sher: యూట్యూబ్లో సంచలనం సృష్టిస్తున్న “ఆయా షేర్” సాంగ్.. 24 గంటల్లోనే!

తేజస్విపై అనుమానాలు

నగలు చోరీ అయినట్టు ఆలస్యంగా గుర్తించిన డాక్టర్ రావు ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేసిన సీఐ మహేశ్​, ఎస్​ఐ కరుణాకర్ తోపాటు క్రైం టీం సిబ్బందితో విచారణ ప్రారంభించారు. దర్యాప్తులో తేజస్విపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఆమెను హబ్సీగూడ బస్టాప్ వద్ద అదుపులోకి తీసుకుని విచారించారు. దీంట్లో తేజస్వి చేసిన నేరాన్ని అంగీకరించింది. ఈ క్రమంలో ఆమె నుంచి 9.5తులాల బంగారు నగలు, 8వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Also Read: Mrunal Thakur: పొట్టి గౌనులో చెమటలు పట్టిస్తున్న మృణాల్ ఠాకూర్!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×