E-Paper
Advertisement

Jagitial Crime: సమాజమా.. ఎటు పోతున్నావు? సొంత చెల్లెలిపైనే కన్నేసిన కామాంధుడు!

Jagitial Crime: సమాజమా.. ఎటు పోతున్నావు? సొంత చెల్లెలిపైనే కన్నేసిన కామాంధుడు!
Advertisement

Jagitial Crime: మనుషుల మధ్య ఉండాల్సిన అనుబంధాలు మంటగలిసిపోతున్నాయి. పవిత్రమైన బంధాలకు అర్థం మార్చేస్తూ, కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లు అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. రక్షణ కల్పించాల్సిన చేతులే వంచనకు దిగుతుండటంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.

తాజాగా జగిత్యాల జిల్లాలో వెలుగుచూసిన ఒక దారుణ ఘటన సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. సొంత చెల్లెలి వరుస అయ్యే అమ్మాయిపై అన్నే కన్నేశాడు. ప్రేమ పేరుతో వంచించి, ఆపై ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చేసిన పాపం చాలదన్నట్లు, విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ ఆ బాలికను తీవ్రంగా భయపెట్టాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.

Advertisement

జగిత్యాల జిల్లాకు చెందిన ఒక మైనర్ బాలికపై వరుసకు అన్నయ్య అయ్యే మనోజ్ అనే యువకుడు ప్రేమ పేరుతో వంచనకు పాల్పడ్డాడు. వరుసకు సోదరి అని కూడా చూడకుండా, సదరు బాలికను ప్రేమాయణం పేరుతో లోబర్చుకున్నాడు. ఈ క్రమంలో ఆమెపై పలుమార్లు బలవంతంగా శారీరక దాడికి (లైంగిక దాడి) పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తానని సదరు బాలికను తీవ్రంగా బెదిరించాడు.

నిందితుడి వేధింపులు , బెదిరింపులతో తీవ్ర మనోవేదనకు గురైన ఆ బాలిక, మరెవరికీ చెప్పుకోలేక చివరికి పురుగుల మందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ వార్త తెలియడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. నిందితుడు మనోజ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
సమాచారం అందుకున్న సిఐ రాంనర్సింహ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో (POCSO)చట్టం కింద కేసు నమోదు చేశారు.

Advertisement

బాధిత కుటుంబ సభ్యులు , గ్రామస్తులు ఆందోళన చెందుతున్న తరుణంలో, సిఐ రాంనర్సింహ రెడ్డి వారికి ధైర్యం చెప్పారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని, బాధితురాలికి , ఆమె కుటుంబానికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరూ ఆందోళన చెందవద్దని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

Related News

Bus Accident: ఘోరం.. మార్కాపురం బస్సు ప్రమాదంలో కొడుకుని కాపాడి తల్లి మృతి

Student Suicide: ఏలూరు CR రెడ్డి ఫార్మసీ కాలేజీలో విషాదం.. అర్ధరాత్రి బిల్డింగ్ పైనుండి దూకి విద్యార్థిని ఆత్మహత్య

Cannabis Seizure: పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి కలకలం.. 60 కేజీల గంజాయి స్వాధీనం

Bus Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నదిలోకి దూసుకెళ్లిన బస్సు, 25 మంది మృతి, లైవ్ విజువల్స్

Alwal Murder Case: అల్వాల్ లో దారుణం.. సొంత తల్లిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన కూతురు, అల్లుడు

Araku Murder: అరకులో దారుణం.. రిసార్ట్స్‌లో వ్యక్తి దారుణ హత్య.. ఉలిక్కిపడ్డ పర్యాటక ప్రాంతం

ORR Accidents: ORR పై డ్రైవింగ్ చేస్తున్నారా? ఈ తప్పులు చేస్తే ఇక అంతే సంగతులు!

Vikarabad Explosion: వికారాబాద్‌లో పేలిన మెటల్ కంపెనీ.. ఎగిసిపడుతున్న మంటలు.. భయాందోళనలో స్థానికులు

Big Stories

Advertisement
×