వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూ.. ప్రియులతో కలిసి కట్టుకున్న భర్తలను చంపుతున్న మహా తల్లుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. రీసెంట్ గా యూపీలో మర్చంట్ నేవీ అధికారి దారుణ హత్య మర్చిపోక ముందే రాజస్థాన్ లో మరో ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా చంపి శవాన్ని సంచిలో కుక్కి బైక్ మీద తీసుకెళ్తూ సీసీ కెమెరాలకు చిక్కారు. డెడ్ బాడీ దొరక్కుండా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తగలబెట్టేందుకు ప్రయత్నించారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
జైపూర్ సౌత్ లో గోపాలి దేవి అనే 42 ఏండ్ల మహిళ దీన్ దయాల్ కుశ్వాహా అనే 30 ఏండ్ల యువకుడితో వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. తాను ఫ్యాక్టరీలో పని చేస్తున్నాని భర్త ధన్ లాల్ షైనీకి చెప్పి, అతడిని కలుసుకోవడానికి వెళ్లేది. ఓ రోజు ఎందుకో అతడికి.. ఆమె మాటల మీద అనుమానం కలిగింది. అసలు ఆమె ఎక్కడ పని చేస్తుందో తెలుసుకోవాలని తాజాగా ఆమెను ఫాలో అవుతూ వెళ్లాడు. రూపాలి నేరుగా వెళ్లి దీన్ దయాళ్ దగ్గరికి వెళ్లి.. సరసాలాడుతూ కనిపించింది. కోపంతో ఊగిపోయిన షైనీ వారితో గొడవపడ్డాడు.
పట్టపగలే బైక్ మీద శవాన్ని తీసుకెళ్లి..
షైనీని మాట్లాడుదాం అని చెప్పి.. రూపాలి దేవి, దీన్ దయాల్.. బిల్డింగ్ మీదికి తీసుకెళ్లారు. అతడు బతికి ఉంటే తమ బాగోతం బయటపడుతుందని భావించి, ఇనుప రాడ్డుతో షైనీ తల మీద బలంగా కొట్టారు. వెంటనే అతడు కింద పడిపోయి ప్రాణాలు విడిచాడు. శవాన్ని మాయం చేయాలని భావించారు. మృతదేహాన్ని గోనె సంచిలో కుక్కారు. అనంతరం బాడీని బైక్ మీద తీసుకెళ్లారు. పట్టపగలే దీన్ దయాల్ బైక్ నడుపుతుండగా, రూపాలి శవాన్ని మధ్యలో పెట్టుకుని వెనుక కూర్చుంది. సుమారు 5 కిలో మీటర్ల దూరం తీసుకెళ్లారు. ఎవరూ లేని ప్రదేశంలో శవాన్ని పడేసి తగలబెట్టారు. శవం కాలుతుండగా అటుగా ఓ కారు రావడంతో ఇద్దరూ భయపడి అక్కడి నుంచి పారిపోయారు. అప్పటికే సగం కాలింది. ఈ విషయాన్ని గుర్తించి కొందరు పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అసలు విషయాన్ని కనిపెట్టారు. మార్చి 16న ఈ హత్య జరగగా, మార్చి 20న హంతకులైన గోపాలి, దీన్ దయాల్ ను పోలీసులు అరెస్టుచేశారు.
In #Rajasthan's #Jaipur, a 42-year-old woman was arrested along with her 30-year-old paramour Wednesday for allegedly killing her husband and setting his body on fire to hide evidence.
DCP (South) Digant Anand said the two accused, #GopaliDevi, a resident of Sanganer, and her… pic.twitter.com/e2dB4Nk8dC
— Hate Detector 🔍 (@HateDetectors) March 20, 2025
పోలీసులు విచారణలో గోపాలి అసలు విషయం చెప్పింది. తమకు అడ్డు వస్తున్నాడనే ఉద్దేశంతోనే తాను, దీన్ దయాల్ కలిసి భర్తను హత్య చేసినట్లు అంగీకరించింది. నిందితులు ఇద్దరి మీద కేసు నమోదు చేసినట్లు జైపూర్ సౌత్ డీసీపీ దిగంత్ ఆనంద్ తెలిపారు. ఇద్దరూ చేసిన నేరాన్ని ఒప్పుకున్నట్లు చెప్పారు. అనంతరం ఇద్దరినీ కోర్టులో ప్రవేశపెట్టి, జైలుకు తరలించారు.
యూపీలోనూ ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
రీసెంట్ గా ఉత్తర ప్రదేశ్ మీరట్ లోనూ ఈ ఇలాంటి ఘటన జరిగింది. మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్ పుత్ ను అతడి భార్య ముస్కాన్, ప్రియుడితో కలిసి దారుణంగా చంపేసింది. డెడ్ బాడీని ఏకంగా 15 ముక్కలు చేసి డ్రమ్ములో పడేసింది. అనంతరం సిమెంట్ నింపింది. తమ కొడుకు మాట్లాడకపోవడంతో అనుమానం కలిగి తల్లింద్రడులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి విచారణలో అసలు వాస్తవాలు వెలుగులోకి రావడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: పట్టపగలే.. కారును వెంబడించి, కత్తులతో నరికి చంపిన దుండగులు.. వీడియో వైరల్!