OTT Movie : సైన్స్ ఫిక్షన్ సినిమాలు ప్రేక్షకులను మరో లోకం లోకి తీసుకెళ్తాయి. వీటిని ఇప్పుడు టెక్నాలజీ ని ఉపయోగించి, ప్రేక్షకుల ఊహకు అందని విధంగా తెరకెక్కిస్తున్నారు. అయితే 1985 లో వచ్చిన ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ అప్పట్లోనే సంచలనం గా మారింది. ఇందులో కృత్రిమంగా ఒక అమ్మాయిని రొమాన్స్ కోసం సృష్టిస్తారు ఇద్దరు యువకులు. ఆ తరువాత ఈ మూవీ సరదాగా సాగిపోతుంది. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime video) లో
1985 లో విడుదలైన ఈ అమెరికన్ టీన్ సైన్స్ ఫిక్షన్ కామెడీ మూవీ పేరు ‘వియర్డ్ సైన్స్’ (Weird Science). దీనికి జాన్ హ్యూస్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కథ ఇద్దరు హైస్కూల్ విద్యార్థుల చుట్టూ తిరుగుతుంది. గ్యారీ వాలెస్, వైట్ డోనెల్లీ అనే వీళ్ళు అమ్మాయిల కోసం తెగ ప్రయత్నాలు చేస్తారు. అయితే వీళ్ళకు ఒక్క అమ్మాయి కూడా పడదు. అప్పుడు వాళ్ళకు వచ్చిన ఒక ఆలోచనతో, పూర్తిగా లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
గ్యారీ, వైట్ ఇద్దరూ తమ పాఠశాలలో అందరికన్నా వెనక బడి ఉంటారు. అక్కడ వీళ్ళను ఎవరూ పెద్దగా గుర్తించారు. అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకోవడంలో కూడా వీళ్ళు విఫలమవుతుంటారు. ఒక రాత్రి, వారు ‘ఫ్రాంకెన్‌స్టైన్’ సినిమా నుండి ప్రేరణ పొంది, కంప్యూటర్‌ను ఉపయోగించి ఒక వర్చువల్ స్త్రీని సృష్టించాలని నిర్ణయిస్తారు. వారు ఒక బొమ్మకు జీవం పోసేందుకు వివిధ ఫీచర్లను ఎంచుకుంటారు.అప్పుడు ఒక విచిత్రమైన విద్యుత్ తుఫాను వచ్చి, వారి ప్రయోగం విజయవంతం అవుతుంది. లిసా అనే అందమైన అతీంద్రియ శక్తులు కలిగిన స్త్రీ కి జీవం వస్తుంది. లిసా వారి జీవితాలను అసాధారణంగా మారుస్తుంది. అమ్మాయిలతో ఎలా రొమాన్స్ చేయాలో కూడా నేర్పిస్తుంది. ఆమె గ్యారీ , వైట్‌లకు ఆత్మవిశ్వాసం పెంచడంలో సహాయపడుతుంది. వారిని స్టైల్ గా మార్చి పార్టీలకు తీసుకెళ్తుంది.
వారి శత్రువులైన ఇతర టీనేజర్లతో ఎదుర్కోవడంలో వీళ్ళకు తోడ్పడుతుంది. ఆమె తన శక్తులతో రాకెట్‌ను సృష్టించడం, వైట్ ఇంటిని గందరగోళంగా మార్చడం వంటి విచిత్ర సంఘటనలను ఎదుర్కొంటారు. అయితే, ఈ ప్రక్రియలో గ్యారీ, వైట్‌లు తమ గురించి, ప్రేమ గురించి, ముఖ్యమైన విషయాల గురించి నేర్చుకుంటారు. చివరికి లిసా వారికి తమ సొంత బలాన్ని గుర్తించేలా చేసి, వారి జీవితాల నుండి అదృశ్యమవుతుంది. ఈ సినిమా కామిడీ , యుక్తవయస్సు సమస్యలు, సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో నిండి ఉంటుంది, ఇది 1980ల నాటి టీన్ సినిమాల్లో ఒక కల్ట్ క్లాసిక్‌గా మిగిలిపోయింది. మీరు కూడా ‘వియర్డ్ సైన్స్’ (Weird Science) అనే ఈ మూవీని చూడాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon prime video) లో సిద్దంగా ఉంది.