Sai Pallavi: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నాచురల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈమె ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది. గతంలో అమరున్ సినిమాతో బ్లాక్ బస్టర్ వేసుకున్న సాయి పల్లవి.. ఈ ఏడాది నాగచైతన్య సరసన తండేల్ మూవీలో నటించి మరో హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకుంది. ఎటు చూసిన ఈమె కెరీర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అయితే తాజాగా ఈమె ఓ భారీ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బలగం వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎల్లమ్మ మూవీ నుంచి ఈ అమ్మడు తప్పుకుందని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది..
గతంలో వచ్చిన బలగం మూవీతో జబర్దస్త్ కమెడీయన్ వేణు దర్శకుడుగా మారాడు. ఈ మూవీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో జబర్‌దస్త్ వేణు కాస్త, ‘బలగం’ వేణు అయిపోయాడు. దిల్ రాజు బ్యానర్‌లో మరో సినిమా చేసే అవకాశం దక్కించుకొన్నాడు. ప్రస్తుతం ఎల్లమ్మ అనే సినిమాను తెరకేక్కించనున్నాడు. హీరోగా నానిని అనుకొన్నారు. కానీ వర్కవుట్ కాలేదు. చివరికి నితిన్ ఫిక్సయ్యాడు. హీరోయిన్ గా సాయి పల్లవి పేరు గట్టిగా వినిపించింది. వేణు కూడా సాయి పల్లవిని కలిసి, కథ చెప్పాడు. తనకూ బాగా నచ్చింది. నితిన్, సాయి పల్లవి కాంబో మూవీ కొత్తగా ఉంటుందని అందరు అనుకున్నారు. కానీ ఇప్పుడు సాయి పల్లవి మూవీ నుంచి తప్పుకుందని టాక్..
Also Read : వర్మ అరాచకాలకు అడ్డులేదా..శారీ మూవీ అందుకే తీస్తున్నాడా..?
సాయి పల్లవి ఇలాంటి హీరోయిన్లకు ఇలాంటి కథ అయితే బాగా సెట్ అవుతుంది అని నటనకు మంచి గుర్తింపు కూడా లభిస్తుందని అందరూ అనుకున్నారు కానీ ఈ సినిమా నుంచి ఆమె తప్పుకుంది. కథ నచ్చిన డేట్లునే సర్దుబాటు కాకపోవడంతో సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొందని టాక్. పైగా ఇటీవల సాయి పల్లవికి వరుస విజయాలు అందాయి. తన పారితోషికం కూడా పెంచేసింది. బడ్జెట్ పరంగా ఈ సినిమాకు సాయి పల్లవికి అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చేంత లేదు. ఎందుకంటే ఇది చిన్న బడ్జెట్ మూవీ.. అంత పారితోషికం ఇస్తే, బడ్జెట్ పరంగా వర్కవుట్ అవ్వదు. అందుకే టీమ్ కూడా మరో కథానాయిక కోసం అన్వేషిస్తోంది. నిజానికి హీరోయిన్ చుట్టు తిరిగితుందని గతంలో ఓ సందర్బంలో వేణు అన్నాడు. ప్రస్తుతం చిత్రయూనిట్ కూడా ఈ విషయమై మల్లగుల్లాలు పడుతోందని టాక్. స్క్రిప్టు దాదాపుగా పూర్తయ్యింది. హీరోయిన్ ఒకే అయితే మూవీ స్టార్ట్ అవుతుంది. మరి హీరోయిన్ గా ఎవరిని ఫిక్స్ చేస్తున్నారో అన్నది ఆసక్తిగా మారింది.. ఇక సాయి పల్లవి ప్రస్తుతం తెలుగు, తమిళ్ళో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. నిజానికి అవన్నీ భారీ ప్రాజెక్ట్ లు కావడంతో వాటికి ఇచ్చిన డేట్స్ లో సినిమాలను పూర్తి చేస్తుంది. అందుకే కొత్త ప్రాజెక్టులకు డేట్స్ అడ్జస్ట్ చెయ్యలేకపోతుంది.. అందుకే ఇటీవల ఓ తమిళ మూవీని రిజెక్ట్ చేసిందని టాక్..