E-Paper
Advertisement

Nandyal Crime: శాడిస్ట్ భర్త.. మద్యం మత్తులో భార్యపై పెట్రోల్ పోసి!

Nandyal Crime: శాడిస్ట్ భర్త.. మద్యం మత్తులో భార్యపై పెట్రోల్ పోసి!
Advertisement

Nandyal Crime: నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఒక భర్త.. తన భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది.

మల్లికార్జున, కళ్యాణి దంపతులు గత కొంతకాలంగా నందికొట్కూరులో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పచ్చని సంసారంలో మద్యం చిచ్చు పెట్టింది. మల్లికార్జున మద్యానికి బానిస కావడంతో తరచూ ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే.. మద్యం మత్తులో ఇంటికి వచ్చిన మల్లికార్జున, భార్య కళ్యాణితో గొడవకు దిగాడు. కోపంతో ఊగిపోయిన అతను.. ఇంట్లో ఉన్న పెట్రోల్‌ను ఆమెపై పోసి నిప్పంటించాడు.

Advertisement

మంటలు అంటుకోవడంతో కళ్యాణి భీకరమైన కేకలు వేసింది. ఆమె అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని.. మంటలను ఆర్పివేశారు. అప్పటికే కళ్యాణి తీవ్రంగా గాయపడటంతో.. ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిందితుడు మల్లికార్జున ఘటన తర్వాత అక్కడి నుండి పరారయ్యాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి.. కేసు నమోదు చేశారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలు , మద్యపానం వల్ల కలిగిన ఘర్షణే ఈ దాడికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడు మల్లికార్జున కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్న కుటుంబంలో తండ్రి చేసిన ఈ ఘాతుకం ఆ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది.

Advertisement

Also Read: తెలంగాణ ఏమైనా నీ అయ్య జాగీరా..? కేసీఆర్‌కు కడియం శ్రీహరి సూటి ప్రశ్న

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×