కడప జిల్లాలో ప్రేమోన్మాది చేతిలో గాయపడిన షర్మిల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తనను ప్రేమించలేదని బాలికపై కులాయప్ప అనే యువకుడు 13 సార్లు కత్తితో పొడిచాడు. ఆమె ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించి.. చికిత్స చేస్తున్నారు. మరోవైపు.. నిందితుని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
Also Read: టీనేజర్ గర్భవతి హత్య.. ప్రియుడు పరార్.. మరో ఇద్దరు అరెస్ట్
దాడి ఘటనపై ఇన్చార్జి మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ విద్యాసాగర్‌తో మంత్రి సవిత ఫోన్లో మాట్లాడారు. తక్షణమే నిందితుడిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. కఠిన శిక్ష పడేలా చూడాలంటూ ఎస్పీని ఆదేశించారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని.. రుయా వైద్యులను మంత్రి సవిత ఆదేశించారు .
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.