Pregnant Teenager Murder| తెలిసి తెలియని వయసులో ప్రేమించుకున్నారు. హద్దులు మీరడంతో యువతి గర్భం దాల్చింది. అయితే ఆమె ప్రియుడు తనేకేమీ సంబంధం లేన్నట్లుగా ఆమెతో కలవడం మానేశాడు. దీంతో ఆమె ఒకరోజు ఇంటి నుంచి అతడిని నిలదీయడానికి వెళ్లింది. కానీ తిరిగి రాలేదు. 20 రోజుల తరువాత పోలీసుల ఆమె శవం లభించింది. ఈ ఘటన హర్యాణా రాష్ట్రంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. దేశ రాజధాని ఢిల్లీలోని నాంగలోయి ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల రష్మి (పేరు మార్చబడినది) ఒక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమె మేకప్ గురించి చేసే వీడియోలు తెగవైరల్ అవుతుంటాయి. అయితే రష్మి కాలేజీకి వెళుతుండగా రోజూ సలీం అలియాస్ సోను అనే 19 ఏళ్ల కుర్రాడు వెంటపడేవాడు. అలా అతను రోజూ ఆమె వెంట పడేసరికి రష్మి అతనితో పరిచయం చేసుకుంది. అతని బైక్ పై కూర్చొని హర్యాణా వెళ్లి టూరిస్ట్ డెస్టినేషన్స్ లో వీడియోలు కూడా చేసింది.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. అలా ఏడాది కాలంగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో అనుకోకుండా ఇద్దరూ హద్దులు దాటారు.. ఫలితంగా రష్మి గర్భం దాల్చింది. ఈ విషయం ఆమె సోనుకి చెప్పింది. అప్పటి నుంచి సోను ఆమెతో కలిసేవాడు. కేవలం ఫోన్ లో మాట్లాడేవాడు. కాలం గడిచే కొద్ది రష్మికి తన గర్భం గురించి ఇంట్లో తెలిసిపోతుందని భయపడేంది. చివరికి ఒకరోజు సోనుని మరో యువతితో బైక్ లో వెళ్లడం చూసి.. అతడికి ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది.
Also Read: బ్యాంకులో దొంగతనం చేసి పరార్.. దేశమంతా స్వామిజీగా జల్సా.. 20 ఏళ్ల తరువాత ఎలా చిక్కాడంటే..
దీంతో సోను భయపడి.. రష్మితో పెళ్లికి అంగీకరించాడు. మరుసటి రోజు ఇంటి నుంచి వచ్చేస్తే.. ఇద్దరూ కలిసి హర్యాణా పారిపోదామని ప్లాన్ చేశారు. సోనుతో పాటు అతని ఇద్దరు స్నేహితులు పంకజ్, సోహిత్ కూడా వచ్చారు. సోను, రష్మి పెళ్లి చేసుకోవడానికి అతని స్నేహితులు సాయం చేస్తున్నారని రష్మికి చెప్పారు. దీంతో రష్మి ఇంటి నుంచి చడీ చప్పుడు చేయకుండా పారిపోయి వచ్చింది. ఆ తరువాత రష్మీని తీసుకొని సోను ఢిల్లీ సరిహద్దులు దాటి హర్యాణా వైపున ఒక నిర్మినుష ప్రాంతానికి వెళ్లారు. అక్కడ పంకజ్, సోహిత్ సాయంతో రష్మిని గొంతు నులిమి హత్య చేశారు.
ఆ తరువాత పంకజ్ ప్లాన్ ప్రకారం.. రష్మిని అక్కడే భూమిలో పాతిపెట్టి వెళ్లిపోయారు. రష్మి తల్లిదండ్రులు రెండు రోజుల తరువాత పోలీసులకు తమ కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రష్మి స్నేహితులను విచారణ చేయగా.. వారికి సోను గురించి తెలిసింది. సోను హర్యాణాలోని రోహ్ తక్ నగరంలో తన స్నేహితుడి వద్ద ఉన్నాడని పోలీసులు తెలుసుకున్నారు. కానీ పోలీసులు అక్కడికి చేరుకునే సరికి సోను పారిపోయాడు. అయితే పొరపాటున వారి చేతికి పంకజ్, సోహిత్ చిక్కారు.
పోలీసులు వారిద్దరినీ గట్టిగా ప్రశ్నించేసరికి జరిగినదంతా చెప్పేశారు. రష్మిని హత్య చేసే ప్లాన్ సోనుదేనని తెలిపారు. ఆ తరువాత రష్మి మృతదేహాన్ని ఎక్కడ పాతిపెట్టారో తెలిపారు. దీంతో పోలీసులు రష్మి శవాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టం కోసం తరలించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం రష్మి 7 నెలల గర్భవతి అని తేలింది.
మరోవైపు రష్మి హంతకుడు సోను పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతుండగా.. అతడి గురించి సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం డిసెంబర్ 6న రోహ్‌తక్ నగరంలో ఒక లాడ్జింగ్ నుంచి పట్టుకున్నారు.