Manchu Family Property Dispute: గత కొద్ది రోజులుగా మంచు కుటుంబంలో సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయంటూ వార్తలు బహిరంగంగా వైరల్ పైన విషయం తెలిసిందే. ముఖ్యంగా అన్నదమ్ములైన మంచు మనోజ్ (Manchu Manoj), మంచు విష్ణు(Manchu Vishnu)మధ్య గొడవలు తారాస్థాయికి చేరినట్లు పెద్ద ఎత్తున వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనికి తోడు మంచు మనోజ్ రెండో వివాహం చేసుకున్నప్పుడు కూడా మంచు విష్ణు దంపతులు బంధువుల లాగ వచ్చి వెళ్ళిపోయారు. ఇక తర్వాత తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా ప్రజలు మాత్రం నమ్మలేదనే చెప్పాలి.
గాయాలతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మంచు మనోజ్..
అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ మోహన్ బాబు (Mohanbabu) కుటుంబంలో గొడవలు జరిగినట్లు ఒక వార్త వైరల్ అవుతోంది. అంతేకాదు నటుడు మోహన్ బాబు పై మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. తన తండ్రి తనను కొట్టాడని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ కంప్లైంట్ చేశారు. ముఖ్యంగా శరీరం మొత్తం గాయాలతో మంచు మనోజ్ పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాదు తనతో పాటు తన భార్యపై కూడా దాడి చేశారని తన తండ్రి మోహన్ బాబు పై ఫిర్యాదు చేశారు మంచు మనోజ్.
కొడుకు పై కంప్లైంట్ ఇచ్చిన మోహన్ బాబు..
అయితే మంచు మనోజ్ పై మోహన్ బాబు కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మనోజ్ తనపై దాడి చేశాడని తన కొడుకు పై కంప్లైంట్ ఇచ్చారు మోహన్ బాబు. మొత్తానికైతే పరస్పర ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు ఈ విషయంపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో తెలియాల్సి ఉంది
ఆస్తుల పంపకం విషయంలో అసలైన గొడవ..
ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ గా గుర్తింపు తెచ్చుకున్న వీరు ఆస్తుల కోసమే పరస్పర దాడులు చేసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆస్తులు, స్కూల్ వ్యవహారంలోనే ఈ దాడులు జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం అటు సెలబ్రిటీలను ఇటు ఇండస్ట్రీని ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురిచేసింది.
మనోజ్ తో గొడవపై మంచు విష్ణు రియాక్షన్..
ఇకపోతే గతంలో మంచు విష్ణు(Manchu Vishnu) మనోజ్ అనుచరుడిపై దాడి చేయడాన్ని వీడియో తీసి, ఆ వీడియోను మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంలో మంచు కుటుంబంలో గొడవలు మొదలయ్యాయని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత మంచు మోహన్ బాబు చొరవ తీసుకొని ఆ వీడియోని డిలీట్ చేశారు. అయితే ఒకానొక సందర్భంలో అలీ షో లో పాల్గొన్న మంచు విష్ణు తో నీకు, నీ తమ్ముడికి మధ్య గొడవలు ఏంటి అంటూ అలీ ప్రశ్నించగా..
మంచు విష్ణు కోపంగా.. రియాక్ట్ అయ్యాడు. వేసుకున్న కోట్ కూడా విప్పేస్తూ.. పర్సనల్ విషయాలు వాళ్లకెందుకు అంటూ నెటిజన్స్ ని ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశాడు మంచు విష్ణు. మొత్తానికైతే గత కొద్ది రోజులుగా మంచు వారసుల మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్నాయి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరగగా..ఇదే ప్రశ్నను ఆలీ అడిగాడు. దీనికి తోడు మంచు విష్ణు అలాంటి రియాక్షన్ ఇవ్వగా ఇప్పుడు మళ్లీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో సరికొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.