RTO Scam: స్వేచ్ఛ బ్యూరో: రవాణా శాఖలో స్మార్ట్ కార్డుల చుట్టూ భారీ తంతు నడుస్తోంది. వాహనదారులకు అందాల్సిన డ్రైవింగ్ లైసెన్సులు (DL), రిజిస్ట్రేషన్ కార్డులు (RC) చేరకముందే చేరిపోయినట్లు రికార్డుల్లో చూపిస్తూ కొందరు సిబ్బంది మాయాజాలం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వాహన రిజిస్ట్రేషన్ చార్జీలోనే.. డ్రైవింగ్ లైసెన్స్ ఫీజులోనే పోస్టల్ ఛార్జీలు వసూలు చేస్తున్నా, కార్డులు మాత్రం ఇంటికి రాకపోవడంతో సామాన్యులు ఆర్టీవో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదే అదనుగా దళారులు రంగప్రవేశం చేసి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. దీంతో రవాణా శాఖకు మచ్చ ఏర్పడుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాహన షోరూం లలో ప్రతి నెల లక్షల వాహనాలు కొనుగోలు అవుతున్నాయి.. వాటన్నిటికీ పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కార్డులు జారీ చేయాల్సి ఉంది.. దీనికి తోడు ప్రతినెల డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీవో కార్యాలయాలకు వేలాదిమంది డ్రైవింగ్ లైసెన్స్ కోసం వస్తుంటారు. వారందరికీ కార్డులు జారీ చేయాల్సి ఉంటుంది.
రవాణా శాఖనియమ నిబంధనల ప్రకారం వాహనదారుడు చెల్లించిన రుసుములో పోస్టల్ ఛార్జీలు కూడా కలిసి ఉంటాయి. ప్రతి కార్డుకు 35 రూపాయలు పోస్టల్ చార్జీ వసూలు చేస్తున్నారు. కార్డు ముద్రించగానే దానిని పోస్ట్ ద్వారా పంపాలి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. కార్డులు పంపకుండానే ‘డిస్పాచ్’ అయినట్లు కంప్యూటర్లలో అప్‌డేట్ చేస్తున్నారని ఆరోపణలు విమర్శలు వస్తున్నాయి. పోస్టల్ బ్యాగుల్లో వెళ్లాల్సిన కార్డులు కొందరు సిబ్బంది చేతుల్లో కి చేరుతున్నాయి. అక్కడి నుండి అవి నేరుగా దళారుల చేతుల్లోకి వెళ్తున్నాయని ప్రచారం జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆర్టీవో కార్యాలయంలో లక్షణాధికార్డులు పెండింగ్లో ఉన్నట్లు విమర్శలు వస్తున్నాయి. కార్డులు రాలేదని కార్యాలయాలను సిబ్బందిని అడిగితే సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని సమాచారం.
ప్రతిదీ కంప్యూటరీ కరణ చేస్తున్నామని.. అవినీతి అక్రమాలకు చోటు లేదని అధికారులు ప్రకటిస్తున్నారు. కానీ అదంతా ప్రకటనలకే పరిమితమైందనే విమర్శలు వస్తున్నాయి. కార్యాలయాల బయట తిరిగే ఏజెంట్లు, ‘మీ కార్డు మా దగ్గర ఉంది’ అంటూ వాహనదారులకు ఫోన్లు చేసి వందల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. కార్డులు ముద్రించిన అవి బాధితులకు చేరడం లేదని మధ్యలోనే పంపిణీలో జాప్యంతోనే చేరడం లేదని సమాచారం. కొందరికింది స్థాయి సిబ్బంది ఈ దళారీల తో కుమ్మక్కే నెలకు లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెళ్ళు వెతుతున్నాయి.
Also read: మAహబూబ్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం.. క్షణాల్లో కాలి బూడిదైన ఫంక్షన్ హాల్!
ఈ అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం గతంలోనే ‘కేంద్రీకృత ముద్రణ’ విధానాన్ని ప్రతిపాదించింది. అన్ని జిల్లాల కార్డులను ఒకే చోట ముద్రించి, అక్కడి నుండే నేరుగా పోస్ట్ చేసేలా ప్లాన్ చేశారు. కానీ ఇంకా అమలులోకి రాలేదు టెండర్లు సైతం పిలువలేదని సమాచారం. ఇది అమలు అయితే స్థానిక ఆర్టీవో కార్యాలయాల్లో సిబ్బంది జోక్యం ఉండదు. దళారుల ప్రమేయం తప్పుతుంది. నేరుగా వాహనదారులకు కార్డులు అందుతాయి. టెండర్ల ప్రక్రియ, ముద్రణ సంస్థలతో ఒప్పందాలు కొలిక్కి రాకపోవడంతో కొందరికి వరంగా మారిందని ప్రచారం జరుగుతుంది.
ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కొందరు కింది స్థాయి సిబ్బంది కక్కుర్తి వల్ల రవాణా శాఖ ప్రతిష్ట మసకబారుతోంది. ఉన్నతాధికారులు తనిఖీలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో ‘కార్డు మాయాజాలం’ మాత్రం ఆగడం లేదు. ఇప్పటికైనా సర్కారు స్పందించి కేంద్రీకృత ముద్రణను తక్షణమే అమలు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. లేకుంటే శాఖకు వస్తున్న చెడ్డ పేరును పోగొట్టాలంటే ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పారదర్శకమైన విధానాన్ని తీసుకురావాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు. లేదంటే ‘కార్డు’ కక్కుర్తి రవాణా శాఖ ప్రతిష్టను మరింత దిగజాలడం ఖాయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లైసెన్స్ కోసం రుసుము కట్టి ఆరు నెలలైంది. ఆన్‌లైన్‌లో చూస్తే డెలివరీ అయినట్లు చూపిస్తోంది. ఆఫీస్‌కు వెళ్తే సరైన సమాధానం లేదు. బయట ఒక వ్యక్తికి ₹500 ఇస్తే గంటలో కార్డు తెచ్చి ఇస్తానంటున్నాడు.” ఓ వాహనదారుడు ఆవేదన.
Also read: నిజమైన పాపాల భైరవులు మీరే.. కేటీఆర్, హరీష్ రావులకు మంత్రి స్ట్రాంగ్ కౌంటర్