Kadapa Accident: కడప గువ్వల చెరువు ఘాట్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డుపై అతివేగంగా వెళ్తున్న లారీ అటుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. బెంగళూరు నుంచి బద్వేలుకు వస్తుండగా జరిగింది ప్రమాదం. యాక్సిడెంట్‌లో ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి మరొక వ్యక్తి కారులో ఇరుక్కుపోగా.. బయటకు తీసేందుకు ప్రయత్నించారు స్థానికులు. చనిపోయిన వారందరూ బద్వేలు మండలంలోని చింతపుత్తయ పల్లెకు చెందిన వారిగా గుర్తించారు. వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.
ఇదిలా ఉంటే.. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం తాటిచెర్లమోటు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, కారు ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను బాపట్ల జిల్లా స్టూవర్టుపురం వాసులుగా గుర్తించారు. వీరంతా మహానంది పుణ్యక్షేత్రంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో కారులో 8 మంది ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటికి తీశారు.