IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటుకు సమయం దగ్గర పడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో అన్ని జట్లు ఇప్పటినుంచే కసరత్తులు ప్రారంభించాయి. తమ జట్ల ప్లేయలను సంసిద్ధం చేసుకుంటున్నాయి అన్ని జట్లు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటు మార్చి 21వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అంటే మార్చి 25వ తేదీన ఫైనల్ జరగబోతుంది అన్నమాట. దాదాపు 75 మ్యాచ్లు… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో జరుగుతాయి. ఈ మేరకు బిసిసిఐ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది.
Also Read: Anil Kumble: ఒకే ఇన్నింగ్స్ లో 10 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే…26 ఏళ్ల తర్వాత వీడియో వైరల్ !
అయితే.. ఐపీఎల్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలోనే… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB ), హైదరాబాద్ కు కొత్త సమస్య తెరపైకి వచ్చి పడింది. ఇంగ్లాండ్ సిరీస్ సిరీస్ తర్వాత చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవుతుంది ఈ టోర్నీ ముగిసిన వెంటనే ఐపిఎల్ ప్రారంభమవుతుంది. ఇందుకోసం ఫ్రాంచైజీలు జట్లను సిద్ధం చేస్తున్నాయి. అంతర్జాతీయ టోర్నీలలో ఆటగాళ్ల ప్రదర్శనపై కూడా జట్ల ఓనర్లు ఓ కన్నేసి ఉంచుతున్నారు. కొందరు రాణిస్తుండగా మరి కొంతమంది బ్యాడ్ ఫామ్ తో సతమతమవుతున్నారు. మరోవైపు ఆటగాళ్లకు అయిన గాయాల బెడద పట్టుకుంది.
17 సీజన్లు గడిచినా ఒక్క టైటిల్ కూడా గెలుచుకోలేని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతి సీజన్ లో హాట్ ఫేవరెట్ గానే బరిలోకి దిగుతోంది. గడిచిన సీజన్ లో అద్భుతంగా రాణించి టైటిల్ వేటులో పోటీ పడింది. కానీ అదృష్టం కలిసి రాక చివర్లో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జోష్ హజెల్ వుడ్ ఆ జట్టుకు తలనొప్పిగా మారాడు. మెగా వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ ను రూ. 12.50 కోట్లకు కొనుగోలు చేసింది. దీనికి ముందు కూడా అతను ఐపీఎల్ లో ఆర్సిబి తరఫున ఆడాడు. కానీ వచ్చే సీజన్లో జోష్ హజెల్ వుడ్ ఆడడం కష్టంగానే కనిపిస్తోంది.
Also Read: Sara Tendulkar: రగిలిపోతున్న సారా….గిల్ కు ఇవ్వాల్సిన ముద్దులు ఆమెకు?
ఇదే జరిగితే ఆర్సిబికి ఎదురు దెబ్బ తగిలినట్లేనని అవుతుంది. ఇటీవలే జరిగిన బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో జోష్ హజెల్ వుడ్ గాయపడ్డాడు. జోష్ హజెల్ వుడ్ ఇప్పుడు ఇంకా ఫిట్ గా లేడు. దీంతో ఈసారి ఛాంపియన్ ట్రోఫీ నుంచి నిష్క్రమించే అవకాశాలు ఉన్నాయి. జోష్ హజెల్ వుడ్ 2020 నుంచి 2023 వరకు ఆర్సిబి తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కామిన్స్ కూడా గాయపడ్డాడు. అతను కూడా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. కామిన్స్ కాలి గాయంతో బాధపడుతున్నాడని దీంతో ఐసీసీ టోర్నమెంట్ లో ఆడే అవకాశాలు లేవని ఆస్ట్రేలియా ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్ డోనాల్డ్ ధ్రువీకరించారు. ఇదే జరిగితే ఆస్ట్రేలియాపై భారీ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. మరి ఇలాంటి బాధల నేపథ్యంలో.. బెంగళూరు జట్టు, హైదరాబాద్ ఎలా ముందుకు వెళుతుందో చూడాలి.