Travel Bus Accident: ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు జోరందుకున్నాయి. ప్రతీ రోజూ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా హరిత ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 10 మంది గాయపడినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అసలు ఘటన ఎలా జరిగింది?
ట్రావెల్స్ బస్సు బోల్తా
ఏపీకి చెందిన ఓ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఆంధ్ర-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. శ్రీనివాసపురం తాలూకా రాయల్పాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచినీళ్ల కోట సమీపంలో వేగంగా వస్తున్న ట్రావెల్ బస్సు అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది.
ఈ ప్రమాదంలో ఒక మహిళ స్పాట్‌లో మృతి చెందింది. మరో 10మందికి పైగా గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఘటన సమయంలో బస్సులో ఎక్కువ మంది ప్రయాణికులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతి చెందిన మహిళ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన అనితగా గుర్తించారు. గాయపడిన వారిలో ఎక్కువగా కడప, రాయచోటి, బెంగళూరుకి చెందిన వారు ఉన్నట్టు తెలుస్తోంది.
ఏపీ నుంచి బెంగుళూరు వెళ్తుండగా ఘటన
ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. జాతీయ రహదారి కావడంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గాయపడినవారిని అంబులెన్సుల ద్వారా సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడినవారిలో పలువురి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఈ ఘటనపై రాయల్పాడు పోలీసులు కేసు నమోదు చేశారు.
ALSO READ: ఓ ఇంట్లో మూడు మృతదేహాలు, షాకైన పోలీసులు
కడప హరిత ట్రావెల్స్ బస్సు కర్ణాటకలో బోల్తా
ఓ మహిళ మృతి, పది మందికి పైగా గాయాలు
బెంగళూరు వెళ్తుండగా ఆంధ్ర – కర్ణాటక బార్డర్ లోని మంచినీళ్లకోట వద్ద డివైడర్ని ఢీకొట్టిన బస్సు
మృతి చెందిన మహిళ ప్రొద్దుటూరుకు చెందిన అనితగా గుర్తింపు
పలువురి పరిస్థితి విషమం, ఆస్పత్రులకు… pic.twitter.com/XUjZ2Mo9Js
— BIG TV Breaking News (@bigtvtelugu) December 2, 2025