E-Paper
Advertisement

Karimnagar Suicide: భార్య ఆత్మహత్య చేసుకున్న ఐదు రోజులకే ఎస్సై చంద్రశేఖర్ సూసైడ్!

Karimnagar Suicide: భార్య ఆత్మహత్య చేసుకున్న ఐదు రోజులకే ఎస్సై చంద్రశేఖర్ సూసైడ్!
Advertisement

Karimnagar Suicide: కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ భార్య దివ్య, ఐదు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె గన్నేరు పప్పు తిని బలవన్మరణానికి ఒడిగట్టారు. అయితే, ఆ సమయంలో తన భార్య కడుపు నొప్పితో మరణించిందని చంద్రశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దివ్య మృతదేహాన్ని ఆమె స్వగ్రామమైన ఇల్లందకుంట మండలం సీతంపేటకు తరలించారు.

దివ్య మరణానికి భర్త చంద్రశేఖరే కారణమని ఆమె బంధువులు, గ్రామస్తులు తీవ్ర ఆరోపణలు చేశారు. అంత్యక్రియల సమయంలో చంద్రశేఖర్‌పై దాడికి కూడా ప్రయత్నించారు. తీవ్ర ఉద్రిక్తత , నిరసనల మధ్య దివ్య తల్లిదండ్రులు ఆమె అంత్యక్రియలను పూర్తి చేశారు. ఈ ఘటనతో చంద్రశేఖర్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.

Advertisement

దివ్య మరణించిన ఐదు రోజుల తర్వాత జరిగే చిన్న కర్మ కోసం చంద్రశేఖర్ తన అత్తగారిల్లైన సీతంపేటకు వెళ్లారు. అక్కడ గదిలోకి వెళ్లిన ఆయన ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు తీసి చూడగా, చంద్రశేఖర్ ఉరి వేసుకొని కనిపించారు.

వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ని జమ్మికుంటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఐదు రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement

Also Read: ఇన్‌ఫ్లుయెన్సర్‌ రీల్‌.. షేర్‌ చేసిన ప్రధాని మోదీ.. దేని గురించంటే?

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×