Road Accident : బస్సుల్లో, వాహనాల్లో ప్రయాణించేటప్పుడు ప్రతీ ఒక్కరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా కిటికీలోంచి తల, చేతులు బయటకు పెట్టే సమయంలో జాగ్రత్త అవసరం. ఈ సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. తాజాగా ఇలాంటి ఓ సంఘటనే కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.
కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లా సింధువల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. శివలింగం (58) అనే మహిళ ప్రయాణ సమయంలో వాంతులు రావటంతో తల బయటకు పెట్టింది. ఈ సమయంలోనే వెనుక నుంచి వచ్చిన టిప్పర్ వాహనం ఢీకొట్టింది. దీంతో ఆమె తల, చెయ్యి తెగి రోడ్డుపై పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఆ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఈ దారుణం చూసిన ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు.
ALSO READ : సండే తీవ్ర విషాదం.. వంశధార నదిలో ఏడుగురు గల్లంతు.. ఇద్దరు మృతి