Srikakulam News: శ్రీకాకుళ జిల్లాలో దారుణ విషాదం చోటుచేసుకుంది. వంశధార నదిలో ఏడుగురు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు మృతిచెందగా.. మరో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలతో బయటడ్డారు.
వివరాల ప్రకారం.. ఇవాళ సండే హాలిడే కావడంతో ఏడుగురు స్నేహితులు శ్రీకాకుళం జిల్లాలోని వంశధార నది వద్దకు సరదగా ఈతకు వెళ్లారు. ఏడుగురు స్నేహితులు ఈత కొట్టేందుకు నదిలోకి దిగారు. నది ఒడ్డు నుంచి కొంత లోపలికి వెళ్లారు. అయతే ఒక్కసారిగా నది ఉధృతి పెరగడంతో ఏడుగురు ప్రవాహంలో కొట్టుకుపోయారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఊపిరాడక ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. గమనించిన స్థానికులు వెంటనే కొట్టుకుపోతున్న మరో ఐదుగురిని రక్షించి ఒడ్డకు చేర్చారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికుల నుంచి మృతుల వివరాలను సేకరించారు.
మృతుల కుటుంబాలకు పోలీసులు సమాచారం అందజేశారు. ఘటనై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.