Pooja Hegde: కొందరు హీరోయిన్స్ స్క్రీన్‌పై హీరోలను కిస్ చేయడానికి, వారితో రొమాన్స్ చేయడానికి ఒప్పుకోరు. కానీ చాలామంది మాత్రం అది ప్రొఫెషన్‌లో భాగమే అనుకుంటారు. అలా అనుకునే వారిలో పూజా హెగ్డే కూడా ఒకరు. హీరోయిన్‌గా డెబ్యూ చేసినప్పటి నుండి చాలావరకు పూజా హెగ్డే చేసిన పాత్రలు అన్నీ మోడర్న్‌గానే ఉంటాయి. పైగా హీరోలతో రొమాన్స్ విషయంలో తను ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తాజాగా ఒక బాలీవుడ్ హీరోతో పూజా చేసిన రొమాన్స్ చూసి సెన్సార్ సైతం షాక్ అయ్యిందట. అందుకే ఆ సీన్‌లో కొన్ని కట్స్ చేసినట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరా హీరో.? ఏంటా సినిమా.?
సెన్సార్ పూర్తి
ఒకప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ అనే ట్యాగ్‌కు చాలా దగ్గర వరకు వెళ్లింది పూజా హెగ్డే. కానీ అంతలోనే చాలామంది యంగ్ హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడంతో తనకు పోటీ విపరీతంగా పెరిగిపోయింది. అయినా కూడా పలువురు స్టార్ హీరోలు మాత్రం పూజాతోనే నటించడానికి ఆసక్తి చూపించేవారు. అలా కొంతకాలం వరకు బాగానే సాగింది. కానీ యంగ్ హీరోయిన్ల పోటీకి పూజా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అందుకే తనకు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ప్రస్తుతం పూజా చేతిలో నాలుగు సినిమాలు ఉండగా.. అందులో ఒకటి జనవరిలో విడుదలకు సిద్ధమయ్యింది. అదే ‘దేవ’. తాజాగా ఈ మూవీకి సెన్సార్ పనులు పూర్తయ్యాయి.
ఆరు సెకండ్లు
రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో షాహిద్ కపూర్ (Shahid Kapoor), పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రమే ‘దేవ’. ఇప్పటివరకు పూజా చేసిన హిందీ సినిమాలు ఏవీ ఆ రేంజ్‌లో హిట్ అందుకోలేదు. అందుకే ప్రస్తుతం తన ఆశలన్నీ ‘దేవ’పైనే ఉన్నాయి. ఈ మూవీ హిట్ అయితే కనీసం బాలీవుడ్‌లో అయినా తనకు అవకాశాలు పెరుగుతాయనే ఆలోచనలో ఉంది ఈ ముద్దుగుమ్మ. జనవరి 31న విడుదల కానున్న ఈ సినిమాకు తాజాగా సెన్సార్ పూర్తయ్యింది. షాహిద్, పూజా మధ్య ఉన్న ఒక ఇంటిమేట్ సీన్‌పై సెన్సార్ కట్ విధించిందట. ఆ సీన్‌లో 6 సెకండ్స్‌ను ట్రిమ్ చేయమని మేకర్స్‌ను ఆదేశించిందట సెన్సార్ బోర్డ్.
Also Read: విమర్శలు, అవమానాలపై స్పందించిన బాలయ్య బ్యూటీ..!
దేవపై ఆశలు
‘దేవ’ (Deva) మూవీకి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ అందించింది. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ‘దేవ’ కాకుండా ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ అనే మరో హిందీ సినిమా కూడా ఉంది. దాంతో పాటు సూర్యతో నటిస్తున్న ‘రెట్రో’, విజయ్‌తో ‘జన నాయగన్’ కూడా ఉన్నాయి. తమిళంలో పూజాకు ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. పైగా విజయ్, సూర్య లాంటి స్టార్ హీరోలతో నటించిన తర్వాత తనకు అవకాశాలు మరింత పెరుగుతాయని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సూర్యతో నటిస్తున్న ‘రెట్రో’ నుండి గ్లింప్స్ విడుదల కాగా.. అందులో పూజా హెగ్డే (Pooja Hegde) లుక్స్‌పై చాలా ట్రోల్స్ వచ్చాయి.
Welcome to Deva’s world – where ACTION speaks louder than words! 💯#DevaTeaser Out Now.
🔗-https://t.co/R0OGWGlfEBReleasing in cinemas on 31st January.@shahidkapoor @hegdepooja @pavailkgulati #RosshanAndrrews #SiddharthRoyKapur #UmeshKrBansal #BobbySanjay @hussainthelal…
— Pooja Hegde (@hegdepooja) January 5, 2025