BigTV English

Khammam Car Accident Facts: ప్రమాదానికి గురైన కారులో దొరికిన సిరంజ్.. ఏంటని ఆరా తీయగా..!

Khammam Car Accident Facts: ప్రమాదానికి గురైన కారులో దొరికిన సిరంజ్.. ఏంటని ఆరా తీయగా..!

Khammam Car accident Shocking Facts: రోడ్డు ప్రమాదం జరిగినట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. విషయం తెలిసిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అనంతరం ఆ కారును పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై ఆరా తీశారు. అయితే, వారికి కారులో ఓ సిరంజ్ దొరికింది. అది అనుమానాస్పదంగా కనిపించేసరికి దానిని స్వాధీనం చేసుకున్నారు.


అనంతరం ఎఫ్ఎస్ఎల్ కు పంపించగా, అసలు విషయం బయటపడింది. ఇటు పోస్ట్ మార్టమ్ రిపోర్టులో అదే విషయం వెల్లడింది. విషయం ఏంటని భర్తను విచారించగా.. భార్య, పిల్లలకు విషం కలిపిన ఇంజక్షన్ ఇచ్చి భర్తే హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లుగా పోలీసులు తేల్చేశారు.

ఇందుకు సంబంధించి ఇతర వార్తా కథనాల ప్రకారం.. ఖమ్మం జిల్లా బాబోజితండాకు చెందిన బోడా ప్రవీణ్, తన భార్య కుమారి(25), ఇద్దరు కుమార్తెలతో కలిసి మే 28న కారులో మంచుకొండ నుంచి హర్యాతండాకు బయలుదేరాడు. గ్రామం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో రహదారిపై వెళ్తున్న పలువురు ఇది గమనించారు. వెంటనే అక్కడికి చేరుకుని కారులోని వారిని బయటకు తీశారు. అప్పటికే ఇద్దురు కుమార్తెలు మృతిచెందారు. అపస్మారక స్థితిలో ఉన్న అతడి భార్యను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. ఆమె కూడా అప్పటికే మృతిచెందినట్లు వైద్యలు నిర్ధారించారు.


Also Read: అమానుషం.. సొంత చెల్లినే గర్భవతిని చేసిన అన్న

Khammam Car accident sensational facts
Khammam Car accident sensational facts

ఈ ప్రమాదంలో ప్రవీణ్ కు స్వల్ప గాయాలు కావడంతో అతడిని బంధువులు ఆటోలో మరో ఆసుపత్రికి తరలించారు. అయితే, ముగ్గురి మృతదేహాలపై గాయాలు కనిపించకపోవడంతో వారు అనుమానాలు వ్యక్తం చేశారు. భర్తే వీరిని చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి తరఫు బంధువులు ఆరోపించారు. ఆసుపత్రి వద్దే ఆందోళన చేపట్టారు.

Also Read: Raithu Runamafi: రైతు రుణమాఫీకి మార్గదర్శకాలు విడుదల

కాగా, ఘటన జరిగిన రోజున పోలీసులు కారును తనిఖీ చేశారు. ఆ కారులో ఖాళీ సిరంజ్ దొరికింది. అనుమానం రావడంతో దానిని స్వాధీనం చేసుకుని ఎఫ్ఎస్ఎల్ కు పంపించగా.. విషం కలిపిన ఇంజక్షన్ ఇచ్చినట్టు తేలింది. ప్రవీణ్ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అందులో కూడా కీలక ఆధారం లభ్యమయ్యింది. అధిక మోతాదులో మత్తు ఇంజక్షన్ ఇస్తే ఎన్నిగంటల్లో చనిపోతారనే విషయాలను ప్రవీణ్ గూగుల్ లో సెర్చ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం రిపోర్ట్, ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా నిందితుడిపై హత్య కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×