Kukatpally Fire Accident: హైదరాబాద్ కూకట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి రాజీవ్ గాంధీ నగర్ లో.. గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా లీకై మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనస్థలికి చేరుకుని మంటలను అదుపుచేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల పేలుడు శబ్దాలు భారీ వస్తున్నాయి. సుమారు 8 సిలిండర్లు పేలినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. ప్రమాదం పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: భారీ అగ్నిప్రమాదం.. ఆకాశాన్ని తాకిన నల్లటి పొగ, భయాందోళనలో స్థానికులు!