Vizag Law student: విశాఖలో లా విద్యార్థి గ్యాంగ్ రేప్ కేసులో కొత్త నిజాలు వెలుగులోకి వస్తున్నాయా? యువతి గ్యాంగ్ రేప్ వెనుక అసలేం జరిగింది? నిందితులు ఆమెకి తెలిసిన వారేనా? ఎవరైనా నమ్మించి మోసం చేశారా? దీనిపై తీగ లాగితే డొంక బయటపడింది.
తొలుత ప్రేమ.. ఆపై పెళ్లి అన్నాడు.. నిజమేనని ఆ యువతి నమ్మేసింది. కామంతో కళ్లు మూసుకుపోయాడన్న విషయాన్ని ఆలస్యంగా గుర్తించింది యువతి. ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విశాఖ న్యాయ స్టూడెంట్ గ్యాంగ్ రేప్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
విశాఖకు చెందిన 20 ఏళ్ల ఓ యువతి లా చదువుతోంది. ప్రస్తుతం మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిణిపై కొందరు గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటన వెనుక ఆమె క్లాస్‌మేట్ ఉన్నట్లు తేలింది.
యువతికి తోటి స్టూడెంట్ వంశీతో పరిచయం ఏర్పడింది. అది వారిద్దరి మధ్య ఫ్రెండ్ షిప్‌గా మారింది. ఈ నేపథ్యంలో మూడు నెలల కిందట అంటే సరిగ్గా ఆగస్టు 10న కంబాల కొండకు వెళ్లారు. ఆ సమయంలో యువతిని బలవంతం చేయబోయాడు వంశీ.
ALSO READ: ఎలక్ట్రిక్ బైక్ షోరూమ్‌లో మంటలు.. యువతి సజీవదహనం..
సీన్ కట్ చేస్తే.. కంబాలకొండ ఘటన జరిగి మూడు రోజుల తర్వాత ఓ రోజు ఉదయం 11 గంటల సమయంలో వంశీ.. ఆ యువతిని డాబాగార్డెన్స్‌లో తన ఫ్రెండ్ రూమ్‌కి తీసుకెళ్లాడు. అక్కడ బలవంతంగా ఆమెని కలిశాడు. ఈ తతంగాన్ని సీక్రెట్‌గా వీడియో తీశారు వంశీ ఫ్రెండ్స్ ఆనంద్, రాజేష్, జగదీష్‌లు.
సీక్రెట్‌గా కలిసిన వీడియో చూపించి బాధిత యువతిని బెదిరించారు మిగతా ముగ్గురు. ఆ తర్వాత ఒకొక్కరుగా లా స్టూడెంట్‌పై అత్యాచారానికి పాల్పడ్డారు. విచిత్రం ఏంటంటే నిందితుల్లో ముగ్గురు న్యాయ విద్యార్థులు కాగా, ఓ వ్యక్తి మాత్రం ఓ ప్రైవేటు కంపెనీలో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు.
ఏకాంతంగా తీసిన వీడియోలు మళ్లీ మళ్లీ చూపించి యువతిని బెదిరించడం మొదలుపెట్టారు వంశీ, ఆయన స్నేహితులు. ఆ తర్వాత ముగ్గురు లా విద్యార్థులు తొట్లకొండలోని చెట్ల పొదల్లోనికి తీసుకువెళ్లి యువతిని మరోసారి అత్యాచారం చేశారు.
ముగ్గురు స్టూడెంట్స్ వేధింపులను రెండు నెలలుగా భరిస్తూ వచ్చింది బాధిత యువతి. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించి, జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పలేక ఈనెల 18న ఇంట్లో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. కూతురు ఆత్మహత్య చేసుకుంటుండగా గమనించిన తండ్రి రక్షించడంతో గ్యాంగ్ రేప్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
బాధిత యువతితోపాటు పేరెంట్స్ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు లా విద్యార్థులతోపాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. దీనిపై ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
నిందితుల సెల్‌ఫోన్ ఏకంతంగా తీసిన వీడియోలు ఎవరికైనా షేర్ చేశారా అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించారు హోం మంత్రి వంగలపూడి అనిత. విశాఖ సీపీతో ఆమె మాట్లాడారు.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.