Satyabhama Today Episode November 20 th : నిన్నటి ఎపిసోడ్ లో.. మైత్రి వెళ్ళిపోయిందని తెలుసుకున్న నందిని మొగుడితో సరదాగా ఉండాలని అనుకుంటుంది. చివరకి హర్ష వల్ల ప్లాన్ ప్లాప్ అవ్వడంతో నందిని డిస్పాయింట్ అవుతుంది. చివరికి ఇద్దరు కలిసిపోతారు. ఇక సంజయ్ మాత్రం చక్రవర్తిని కలిసి డబ్బులు కావాలని అడుగుతాడు. కానీ అంత డబ్బులు ఇవ్వాలి అంటే కష్టం అని అంటాడు. ఇక సత్య క్రిష్ తన తండ్రిని కనిపెట్టాలని అనుకుంటుంది. ఆ విషయాన్నీ మాత్రం చక్రవర్తి బయట పెట్టడు.. ఇక చక్రవర్తి ఎంతగా వాదించిన సత్య వినదు.. క్రిష్ కు ఈరోజు నిజం ఏంటో చెబుతాను అని ప్రామిస్ చేస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సంజయ్ సంధి ని ఫాలో అవుతూ రెస్టారెంట్ కి వెళ్తాడు. అక్కడ సంధి ను అనుకోకుండా చూసాను అన్నట్టు డ్రామా మొదలుపెడతాడు. దానికి ఒక పెద్ద స్టోరీ చెప్తాడు. కానీ సంధ్య మాత్రం ఆ స్టోరీని విని అస్సలు నమ్మదు. ఇక సంజయ్ సంధ్యతో పులిహార కలుపుతాడు. ఇక రేపు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలీదు నేను ఎక్కడికి వెళ్తున్నాను నీకు తెలియదు. అయితే మళ్లీ మనిద్దరం కలిస్తే మనల్ని విధి కలుపుతుందని అనుకోవాలి అని సంజయ్ అంటాడు . ఇక దానికి సంధ్య రేపు కలిసినప్పుడు ఆలోచిద్దాం మనల్ని విధి కలుగుతుందో లేకపోతే ఇంకేదో అనేసి వెళ్ళిపోతుంది.
ఇకపోతే చక్రవర్తి ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. నేను ఎంత చెప్పినా సత్యవాదిస్తుంది అన్నయ్య గురించి తెలిసి కూడా ఇలా ఆలోచిస్తే ఎంత తప్పు మొదటికే ప్రమాదం వస్తుంది. క్రిష్ ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను అనుకుంటున్నాను సత్యకు ఎటువంటి పరిస్థితుల్లో నిజం తెలియకూడదు అనేసి చక్రవర్తి అనుకుంటాడు. నిజం తెలిసిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించడానికి కష్టంగా ఉంది నా కొడుకుకి ఏమి కాకుండా దేవుడే కాపాడాలి అనేసి చక్రవర్తి అనుకుంటాడు. అప్పుడే సత్య ఫోన్ చేస్తుంది. మావయ్య మీ కొడుక్కి బైక్ మీద వెళ్తుంటే ఎవరో కత్తులతో దాడి చేశారు. కృష్ణవేణి హాస్పిటల్ లో జాయిన్ చేశారు మీరు రండి అనేసి చెప్తుంది. ఇక సత్య చెప్పిన మాట విని చక్రవర్తి హాస్పిటల్ కి వెళ్తాడు. మామయ్య చేత ఈరోజు ఎలాగైనా నిజాన్ని తెప్పించాలని సత్య అనుకుంటుంది అందులోకి చక్రవర్తి ఫోన్ చేస్తాడు. సత్య నేను హాస్పిటల్ లో ఉన్నాను అమ్మ నువ్వు ఎక్కడున్నావనేసి చక్రవర్తి ఫోన్ చేస్తాడు. ఇక సత్యా మావయ్య ఇక్కడ ఉన్నాను మీరు ఇక్కడికి రండి అనేసి అంటుంది. క్రిష్కి ఎలా ఉందమ్మా ఏమైంది నేను కృష్ణ వెంటనే చూడాలి అని అంటాడు. కొడుకుకి ఏమైందో నీ టెన్షన్ పడతాడు చక్రవర్తి. సత్య చెయ్యి పట్టుకుని రామ వెంటనే కృష్ణ చూడాలి అనేసి అంటాడు.
ఇక సత్యా చక్రవర్తి నుంచి నిజం రప్పించాలని ఇలా నాటకం ఆడినట్టు చెప్తుంది. నేను చెప్పింది క్రిష్ కి కాదు మీ కొడుకు సంజయ్ కి ప్రమాదం జరిగిందని మీ కొడుకు సంజయ్ కదా మామయ్యా అని చురకలేస్తుంది. అసలు నిజం ఏంటి ఎందుకు మీరు ఈ నిజాన్ని దాచాలనుకుంటున్నారు మీ కొడుకుని మీ కొడుకు కాదని ఎందుకు చెప్తున్నారు అనేసి చక్రవర్తిని అడుగుతుంది. చక్రవర్తి ఆ రాక్షసుడికి భయపడి అమ్మ నా కొడుకుకి ఏమి కాకుండా ఉండాలని నేను ఇన్ని ఇన్నేళ్లు నిజాన్ని దాచానని అంటాడు. మీరు ఇప్పటికైనా నిజాన్ని చెప్పండి మీ కొడుకు గురించి మీకు బాగా తెలుసు తనని ఎవరు ఎదిరించలేరు. రాక్షసుడి బాగోతాన్ని బయట పెట్టండి అనగానే ఆరోజు జరిగింది ఒక తప్పు కాదు మా రెండు తప్పులు అని చక్రవర్తి అంటాడు. రెండు తప్పుల ఏంటి మావయ్య అని సత్య అడుగుతుంది.. అసలు నిజాన్ని మీరు చెప్పండి ఆ తర్వాత ఏం జరుగుతుందో దేవుడికే వదిలేద్దాం మీ వెనకాల నేను ఉంటాను మీ సపోర్ట్ నాకు ఉంటుందని నేను అనుకుంటున్నాను మావయ్య అని చక్రవర్తిని సత్య అడుగుతుంది. మొత్తానికి సత్య అయితే క్రిష్ అసలు తనదేవరో నిజం తెలుసుకుంది. ఒక తర్వాత ఎలాంటి ప్లాన్ చేస్తుందో క్రిష్ కి ఎలాంటి నిజాన్ని చెప్తుందో చూడాలి.
ఇక నందిని హర్ష కాస్త రొమాంటిక్గా ఉంటారు. ఇద్దరు గిల్లికజ్జాలు ఆడుకుంటారు. మైత్రి టాపిక్ తీసుకురాకపోతే నందిని హ్యాపీగా ఉంటుందని హర్ష ఆలోచిస్తాడు. నీ సంతోషం కోసం సాయంత్రం ఫుడ్ పార్టీకి వెళ్దాం అనేసి చెబుతాడు. వీళ్ళిద్దరిని బామ చూసి మురిసిపోతుంది. నందిని దగ్గరికి పోయి బామ్మకు కౌంటర్లు ఇస్తుంది. ఇక సత్య మాట విని చక్రవర్తి సైలెంట్ అవుతాడు అసలు నిజం చెప్పాలని రెడీ అవుతాడు. ఏమైనా అవుతుందేమో అని భయపడతాడు. నేనున్నాను మామయ్య మీరు భయపడకండి అసలు నిజం ఏంటో చెప్పండి మీ కొడుకు మిమ్మల్ని నాన్నగా యాక్సెప్ట్ చేస్తారు అని అంటుంది.. ఇక ఇద్దరు కలిసి క్రిష్ ను ఎలా మార్చాలి అని అనుకుంటారు. ఇక మహాదేవయ్య కు క్రిష్ మసాజ్ చేస్తాడు.. అప్పుడే సత్య అక్కడికి వస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో చక్రవర్తి పుట్టినరోజు వేడుకలను ఘనంగా చేస్తారు.. రేపు ఏం జరుగుతుందో చూడాలి..