E-Paper
Advertisement

సహజీవనం చిచ్చుపెట్టింది.. ప్రియుడి మాటల్లో పడి.. ఐదేళ్ల కూతుర్ని చంపేసింది, చివర్లో ట్విస్ట్ ఏంటంటే..

సహజీవనం చిచ్చుపెట్టింది..  ప్రియుడి మాటల్లో పడి..  ఐదేళ్ల కూతుర్ని చంపేసింది, చివర్లో ట్విస్ట్ ఏంటంటే..
Advertisement

Bengaluru: సహజీవనం.. గెట్ టు గెదర్.. ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అయ్యింది.. అవుతోంది కూడా. ఫలితంగా పచ్చని సంసారంలో నిప్పులు పోస్తున్నారు. ఆపై చంపుకోవడాలు వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది. ప్రియుడి కోసం కన్న కూతుర్ని చంపేసింది ఓ మహిళ. చివరకు పోలీసులు అరెస్టు చేశారు. అసలేం జరిగింది?

బెంగుళూరులో దారుణ ఘటన.. సహజీవనం చిచ్చుపెట్టింది

Advertisement

కర్ణాటకలోని దావణగెరెకు చెందిన ప్రవీణ్‌-ప్రియాంకలు దశాబ్దం కిందట వివాహం చేసుకున్నారు. బెంగుళూరులోని ప్రవీణ్‌ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రియాంక న్యాయవాదిగా పని చేస్తున్నారని తెలుస్తోంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కొడుక్కి 11 ఏళ్లు, ఐదేళ్ల కూతురు ఉన్నారు.

హ్యాపీగా సాగుతున్న వీరి సంసారంలోని మూడో వ్యక్తి ఎంటరయ్యాడు. ఆ వ్యక్తి ఎవరోకాదు ప్రియాంక పాఠశాల ఫ్రెండ్. అతడి పేరు మోహన్.. పాఠశాల సమయంలో ప్రియాంక-మోహన్ మంచి ఫ్రెండ్స్. ప్రస్తుతం మోహన్ రియల్‌ ఎస్టేట్ వ్యాపారి అని నమ్మించాడు. ఆ తర్వాత మోహన్-ప్రియాంకలు మళ్లీ క్లోజ్ అయ్యారు.

Advertisement

ఇద్దరి మధ్య మాంచి సాన్నిహిత్యం ఏర్పడింది. వీరిద్దరి మనసులు కలిశాయి. ఈ తతంగాన్ని ముందుగానే గమనించిన భర్త ప్రవీణ్‌.. భార్య ప్రియాంక-మోహన్‌లను హెచ్చరించాడు. ఈ విషయాన్ని పోలీసులు స్వయంగా చెప్పారు. భర్త కంటే ప్రియుడు మంచివాడని నమ్మింది ప్రియాంక. ప్రియుడితో జీవితం పంచుకోవాలని డిసైడ్ అయ్యింది.

ప్రియుడి మాటల్లో పడి.. ఐదేళ్ల కూతుర్ని చంపేసింది

కొడుకు కాస్త పెద్దవాడు కావడంతో, కూతురు వైపు ఫోకస్ చేసింది ప్రియాంక. కుమార్తెని తీసుకుని భర్త ఇంటిని వదిలేసింది. మోహన్‌తో సహజీవితాన్ని ప్రారంభించింది ప్రియాంక. అంతా ఓకే అయిన తర్వాత భర్తకు విడాకుల నోటీసులు పంపించింది. అదే సమయంలో భర్తకు మరో విషయం చెప్పింది. అనారోగ్యంగా కారణంగా కూతురు చనిపోయిందని చెప్పింది. అంత్యక్రియల తర్వాత పోస్టుమార్టం నివేదిక భర్తకు పంపించింది ప్రియాంక.

ఆ నివేదిక సమగ్రంగా లేదని కొందరు చెప్పడంతో ప్రియాంకపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు భర్త ప్రవీణ్. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. కూతుర్ని గొంతు నులిమి తల్లి హత్య చేసినట్లు తేలింది. ఈ ఘటనలో ఇప్పటికే మోహన్‌ను అరెస్టు చేశారు పోలీసులు. అప్పటి నుంచి పరారీలో వున్న ప్రియాంకకు, గురువారం హాసనలో అరెస్టు చేశారు.

బెంగుళూరుకు తీసుకొచ్చి ఆమెని పోలీసులు విచారించారు. విచిత్రం ఏంటంటే.. ప్రియుడితో సన్నిహితంగా ఉండటానికి పాప అడ్డు వస్తోందని భావించి కడ తేర్చినట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. క్లాస్‌మేట్ మోహన్‌ మాయమాటలు చెప్పి ప్రియాంకను తప్పుదారి పట్టించినట్లు భావించారు. కోటీశ్వరుడినంటూ ఆమెని నమ్మించాడు.

ALSO READ: క్యూనెట్ నయా మోసం.. ఇగ్నైట్ పేరుతో రూ.5 వేల కోట్లకు స్కెచ్.. 18 రోజుల్లోనే క్లోజ్!

చివరకు ఫ్రెండ్ గురించి అంతా తెలుసుకుని భర్తకు దూరమైంది. కన్న కూతుర్ని చేతులారా చంపేసింది. చివరకు కటకటాల పాలైంది. ఇంతకీ మోహన్‌ అద్దె ఇళ్ల బ్రోకర్‌ అని తేలింది. ఘటన ఎప్పుడు జరిగింది? మార్చి 25న ప్రియాంక-మోహన్ ఇంట్లో అనుమానాస్పద పరిస్థితుల్లో ఐదేళ్ల కూతురు మరణించింది.

పోలీసుల విచారణలో ప్రియాంక పుట్టినరోజు సందర్భంగా హోసకోటకు వెళ్లారు. బిర్యానీ తీసుకెళ్లిన తర్వాత మోహన్ ఆ చిన్నారిపై కారులో దాడి చేసి, ఊపిరాడకుండా చేసి చంపినట్లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రాథమిక విచారణలో కూతురు కలర్ నచ్చలేదని ప్రియాంక చెప్పినట్టు తెలుస్తోంది. ప్రియాంక, ఆమె ప్రియుడు రకరకాలుగా సమాధానాలు చెప్పడంతో వారిని మరింతగా విచారించేందుకు సిద్ధమయ్యారు బెంగుళూరు పోలీసులు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×