BigTV English

London Crime| బిబిసి జర్నలిస్ట్ భార్య, ఇద్దరు కుమార్తెల హత్య.. ఎందుకు జరిగిందంటే..

బిబిసి వార్తా సంస్థలో రేసింగ్ వ్యాఖ్యాతగా పనిచేసే జాన్ హంట్ భార్య, ఇద్దరు కుమార్తెలను ఒక యువకుడు హత్య చేశాడు. ఈ ఘటన మంగళవారం నార్త్ లండన్ లోని బుషే ప్రాంతంలో జరిగింది. ఆ సమయంలో జాన్ హంట్ ఇంట్లో లేరు.

London Crime| బిబిసి జర్నలిస్ట్ భార్య, ఇద్దరు కుమార్తెల హత్య.. ఎందుకు జరిగిందంటే..

London Crime| బిబిసి వార్తా సంస్థలో రేసింగ్ వ్యాఖ్యాతగా పనిచేసే జాన్ హంట్ భార్య, ఇద్దరు కుమార్తెలను ఒక యువకుడు హత్య చేశాడు. ఈ ఘటన మంగళవారం నార్త్ లండన్ లోని బుషే ప్రాంతంలో జరిగింది. ఆ సమయంలో జాన్ హంట్ ఇంట్లో లేరు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్త్ లండన్ లోని ఎన్ ఫీల్డ్ ప్రాంతానికి చెందిన కైల్ క్లిఫార్డ్ అనే 26 ఏళ్ల యువకుడు జాన్ హంట్ ఇంట్లో అనుమతి లేకుండా ప్రవేశించి ఇంట్లో ఉన్న ముగ్గురు మహిళలు.. జాన్ హంట్ భార్య.. కారోల్ హంట్(61), ఇద్దరు కుమార్తెలు హన్నా(28), లూసీ(25)ని క్రాస్ బౌ(తుపాకీ లాంటి విల్లు)తో హత్య చేశాడు.

Also Read:  దారుణం.. దుబాయ్‌లో భారతీయుడిని చంపిన పాకిస్థానీయులు


హత్యకు ముందే జాన్ హంట్ కుటుంబంతో పరిచయముందని పోలీసులు తెలిపారు. హత్య తరువాత నిందితుడు ఘటనాస్థలం నుంచి పారిపోయాడు. పోలీసులు అతడిని సీసీటీవి ఆధారంగా గుర్తించి 24 గంటల్లో అరెస్టు చేశారు. అరెస్టు చేసే సమయంలో నిందితుడి గాయాలున్నాయని.. హత్య చేసే సమయంలో మృతులు ఆత్మరక్షణ కోసం ఎదురు దాడి చేసి ఉండవచ్చునని పోలీసులు చెప్పారు.

నిందుతుడు కైల్ క్లిఫోర్డ్ కు మానసిక సమస్యలున్నాయని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు హత్య ఉపయోగించిన క్రాస్ బౌ ఆయుధం.. కలిగి ఉండడానికి లండన్ లో ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు.. కానీ పబ్లిక్ స్థలాల్లో క్రాస్ బౌ తీసుకువెళ్లడానికి పోలీసుల అనుమతి తప్పనిసరి.

Also Read: ఎనిమిదేళ్ల చిన్నారి మిస్సింగ్ కేసులో ట్విస్ట్.. అత్యాచారం చేసి హత్య చేసిన ముగ్గురు మైనర్లు!

గత మార్చి నెలలో లండన్ లోని షోర్ డిచ్ ప్రాంతంలో ఒక 47 ఏళ్ల వ్యక్తి క్రాస్ బౌతో ఇద్దరిని గాయపరిచినందుకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఇలాగే 2021 జస్వంత్ సింగ్ చైల్ అనే 21 ఏళ్ల యువకుడు క్రాస్ బౌతో లండర్ మహారాణి ఎలిజబెత్ 2 ని హత్య చేసేందుకు ప్రయత్నించాడు. ఆ తరువాత అతడిని పోలీసులు 2023 అక్టోబర్ లో పట్టుకున్నారు.

 

London Crossbow murders, BBC HOST FAMILY MURDER, London crime,

Tags

Related News

Chirala Beach Accident: బీచ్‌లో విషాదం.. స్నానం చేస్తూ ఐదుగురు మాయం

Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

Tirupati Drug Case: పాడుబడ్డ బంగ్లాలో డ్రగ్స్ తీసుకుంటూ.. ఇద్దరు యువకులు అరెస్ట్

Siddipet Crime: పెళ్లయిన 13 రోజులకే ప్రెగ్నెంట్.. డాక్టర్ సమాధానంతో భర్త షాక్, ఏం జరిగింది?

Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో నలుగురు మృతి

Sangareddy News: కిలేడీ విద్య ఎక్కడ? జాబితాలో సినీ-బిల్డర్లు? పోలీసులపై అనుమానాలు?

Medak District: దారుణం.. పని ఇస్తామని నమ్మించి.. మహిళపై అత్యాచారం

Warangal Crime: బీటెక్‌ విద్యార్థిని సూసైడ్.. అసలు కారణం అదేనా?

Big Stories

×