E-Paper
Advertisement

మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్

మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్
Advertisement

Machkund Fire: ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో ఉన్న మాచ్‌‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సాంకేతిక కారణాల వల్ల పవర్ స్టేషన్‌ను అత్యవసరంగా షట్‌డౌన్ చేసిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో విద్యుత్ కేంద్రం రెండో అంతస్తులో విధుల్లో ఉన్న పలువురు కార్మికులు లోపలే చిక్కుకుపోయారు.

ప్రమాద స్థలంలో దట్టమైన పొగ, సెగలు అలుముకోవడంతో కార్మికులను రక్షించేందుకు లోపలికి వెళ్లడం రెస్క్యూ సిబ్బందికి సాధ్యం కావడం లేదు. పైగా ఈ పవర్ హౌస్ కొండల మధ్య, మారుమూల అటవీ ప్రాంతంలో ఉండటంతో అగ్నిమాపక వాహనాలు, సహాయక సిబ్బంది అక్కడికి చేరుకోవడానికి తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి.

Advertisement

రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు కావడంతో అటు ఏపీ, ఇటు ఒడిశా అధికారులు సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. లోపల చిక్కుకున్న వారి పరిస్థితి ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also Read: రాజ్యాంగాన్ని కాపాడటమే రాహుల్ గాంధీ లక్ష్యం.. బీజేపీది ఓట్ల చోరీ కుట్ర.. జగ్గారెడ్డి

Advertisement

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×