Big Stories

Cop Killed by Sand Mafia| ఇసుక మాఫియాని అడ్డకున్న పోలీస్ అధికారి హత్య!

Cop Killed by Sand Mafia| అక్రమ ఇసుక రవాణాని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ పోలీస్ అధికారిని ఓ ట్రాక్టర్ డ్రైవర్ హత్య చేశాడు. ఈ షాకింగ్ ఘటన శనివారం మే 5న, మధ్య ప్రదేశ్ లోని షాహ్ డోల్ జిల్లాలో జరిగింది. ఇటీవలే అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఓ ఎంఆర్వో కూడా హత్య చేయబడడంతో తాజా ఘటన స్థానికంగా కలకలం రేపింది.

- Advertisement -

షహ్ డోల్ జిల్లా లో అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్ గా ఉద్యోగం చేస్తున్న మహేంద్ర బగ్రీకి.. బడౌలి హెలీప్యాడ్ ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా జరుగుతోందని సమాచారం అందడంతో శనివారం రాత్రి 11 గంటలకు ఘటనా స్థలానికి ఇద్దరు కానిస్టేబుళ్లతో వెళ్లాడు. అక్కడ ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుండడం చూసి వారిని అడ్డకునేందుకు ప్రయత్నించాడు. కానీ ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ అడ్డుగా వచ్చిన సబ్ ఇన్స్ పెక్టర్ మహేంద్ర బగ్రీ, ఇద్దరు కానిస్టేబుళ్లపై వాహనం ఎక్కించేశాడు. ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్లు గాయాలతో తప్పించుకోగా.. ఇన్స్ పెక్టర్ మహేంద్ర శరీరం వాహనం కింద నలిగి పోయింది.

- Advertisement -

ట్రాక్టర్ డ్రైవర్ వెంటనే అక్కడి నుంచి పారిపోగా.. పోలీస్ కానిస్టేబుళ్లు.. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న తరువాత పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి సబ్ ఇన్స్ పెక్టర్ మహేంద్ర చనిపోయారు. మహేంద్ర కుటుంబంలో ఆయన భార్య, ముగ్గురు కూతుర్లున్నారని తెలిసింది. జిల్లా ఎడీజీపీ సాగర్ ట్రాక్టర్ డ్రైవర్ ను పట్టుకునేందుకు ఆదేశాలు జారీ చేశారు. పోలీసుల ప్రత్యేక బృందం ఉదయం కల్లా నిందితుడు ట్రాక్టర్ డ్రైవర్ ని అరెస్టు చేశారు.

షహ్ డోల్ ప్రాంతంలో గత రెండు నెలల్లో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడో సారి. రెండు నెలల క్రితం అక్రమ ఇసుక రవాణాను అడ్డుకునేందుకు వెళ్లిన ఎంఆర్ వో తన బృందంతో వెళ్లగా.. ఎంఆర్ వో కూడా హత్య గురయ్యారు. అలాగే రెండు రోజుల క్రితం మైనింగ్ శాఖ అధికారులుపై ఇసుక మాఫియా దాడులు చేసినట్లు స్థానిక మీడియా వెళ్లడించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News