BigTV English

Kadapa Postal Voting : పార్టీ కండువాతో పోలింగ్ బూత్ లోకి వైసీపీ నేత.. టీడీపీ సీరియస్

Kadapa Postal Voting : పార్టీ కండువాతో పోలింగ్ బూత్ లోకి వైసీపీ నేత.. టీడీపీ సీరియస్

Postal Ballot Voting Issue in Kadapa : ఏపీలో నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది, ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మూడురోజుల పాటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. కడపలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతున్న పోలింగ్ కేంద్రంలో వైసీపీ అభ్యర్థి పార్టీ కండువాతో వెళ్లడం వివాదానికి దారితీసింది.


గాంధీనగర్ స్కూల్ లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రం ఏర్పాటు చేసారు. అక్కడికి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజద్ బాషా పార్టీ కండువాతో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. అనుచరులతో సహా పోలింగ్ బూత్ లోకి వెళ్లడంతో.. టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అంజద్ బాషాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read : ఫ్యాన్ గాలికి హామీలు కొట్టుకుపోయాయ్: వైఎస్ షర్మిల


కాగా.. ఏపీలో ఎన్నికలకు ఇంకా వారంరోజులే సమయం ఉంది. ప్రచారానికి మరో ఐదురోజుల్లో తెరపడనుంది. దీంతో అన్నిపార్టీల అభ్యర్థులు, పార్టీల అధినేతలు ప్రచారాల్లో వేగం పెంచారు. రోజుకు 2-3 సభలు, రోడ్ షో లు నిర్వహించి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మే 13న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ ఏడాది జనవరిలో ఈసీ విడుదల చేసిన ఓటర్ల తుది జాబితా ప్రకారం.. ఏపీలో మొత్తం 4 కోట్ల 8 లక్షల 7వేల 256 మంది ఓటర్లున్నారు. కొత్తగా 22 లక్షల 38 వేల 952 మంది ఓటు హక్కును పొందారు. అత్యధికంగా కర్నూల్ లో 20 లక్షల 16 వేల 396 మంది ఓటర్లు ఉంటే.. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7 లక్షల 61 వేల 538 మంది ఓటర్లు ఉన్నారు.

Tags

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×