Mahabubabad Crime: మహబూబాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఎన్నో కలలతో వైవాహిక ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఓ పెళ్ళికొడుకుని విధి వెంటాడింది. కాళ్లకు పెట్టిన పారాణి ఆరక ముందే ఆ పెళ్లి కొడుకుని మృత్యువు కబళించింది. పెళ్లి అయి కనీసం 24 గంటలు గడవక ముందే ఆ పెళ్లి కొడుకు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. ఈ హృదయ విదారక ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోడి పుంజుల తండాలో చోటు చేసుకుంది.
అయితే తండాకు చెందిన ఇస్లావత్ నరేశ్‌కు 19 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ని కృష్ణా జిల్లా కంకిపాడుకి చెందిన యువతితో వివాహం జరిగింది. ఈ రోజు రిసెప్షన్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. త్రాగు నీటి కోసం విద్యుత్ మోటార్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై పెళ్లికొడుకు అక్కడిక్కడే దుర్మరణం చెందాడు. అక్కడ ఉన్న స్థానికులు అతనని కాపాడానికి ఎంతో ప్రయత్నం చేశారు అయిన వాళ్ల వాళ్ల కాకాపోవడంతో అక్కడి సమీపంలోని ఆసుపత్రికి తీసుకువేళ్లే దారిలోనే వరుడు చనిపోయాడు.
Also Read: రాజ్‌భవన్‌లో చోరీ.. నిందితుడు వారంలో రెండుసార్లు అరెస్టు
24 గంటలలోపే తన కళ్లెదుటే భర్త మృత్యువాత పడడంతో నూతన వధువు షాక్ గురై, స్పృహ కోల్పోయింది. పెండ్లి డప్పు మోగిన కొన్ని గంటలలోపే చావు డప్పు మోగడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.