WAR 2 Movie Story : ఎన్ని సినిమాలు వచ్చినా… ఇండియన్స్‌కు ఈ స్పై థ్రిల్లర్ తాలూకు సినిమాలు అంటే చాలా ఇష్టం. ఆ జానర్ లో ఎన్ని సినిమాలు వచ్చినా… బతికేస్తాయి. అందులో ఇంకా పాకిస్థాన్ టెర్రరిస్టులు అని ఉంటే ఇక సినిమా బ్లాక్ బస్టర్ అంతే. ఈ సెంటిమెంట్‌నే వాడుతున్నారు యష్ రాజ్ ఫిల్మ్స్.
యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ అంటూ కొంత మంది డైరెక్టర్లతో వరుసగా సినిమాలు చేస్తున్నారు యష్ రాజ్ ఫిల్మ్స్ అనే ప్రొడ్యూసర్లు. ఇప్పటికే ఈ యూనివర్స్‌లో 5 సినిమాలు వచ్చాయి. 6వ సినిమాగా వార్ 2 రాబోతుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగష్టు 14న రిలీజ్ కాబోతుంది. అయితే ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్‌తో మూవీ స్టోరీ ఏంటో తెలిసిపోతుంది. ఇది ఎప్పటిలానే… గతంలో వచ్చిన స్పై సినిమాల్లానే ఉండబోతుందని అర్థమవుతుంది.
YRF స్పై యూనివర్స్ నుంచి గతంలో వచ్చిన సినిమాలను గమనిస్తే… హీరో ఓ ‘రా’ ఏజెంట్. ఆ హీరో డైరెక్టర్ ఇతర దేశాల్లో ఉండే టెర్రరిస్టులతో వార్ జరుగుతూ ఉంటుంది. అంతలోనే తెలుస్తుంది ఆ టెర్రరిస్టు గ్రూప్ కి ఓ పెద్ద తలకాయ ఉంటుందని, ఆ పెద్ద తలకాయ గతంలో ‘రా’ ఏజెంట్ గా పని చేశాడని తెలుస్తుంది.
అయితేే… కొన్ని కారణాల వల్ల ‘రా’ ఏజెంట్ గా తప్పుకుని దేశంపై కోపం పెంచుకున్న వ్యక్తి అలా… టెర్రరిస్ట్ గ్రూపులకు లీడర్ అవుతాడని హీరో అండ్ టీం తెలుసుకుంటారు.
ఈ YRF స్పై యూనివర్స్ లో వచ్చిన చాలా సినిమాల్లో ఇదే స్టోరీ. ఇప్పుడు వార్ 2 లో కూడా ఇదే స్టోరీ ఉన్నట్టు ఈ రోజు వచ్చిన టీజర్ తో తెలిసిపోతుంది. హీరో కబీర్ (హృతిక్ రోషన్) ఇప్పటికే అందరికీ తెలిసిన ‘రా’ ఏజెంట్. ఇతనితో ఫైట్ చేసేది జూనియర్ ఎన్టీఆర్. ఇతను కూడా మాజీ ‘రా’ ఏజెంట్ అని ఈ రోజు వచ్చిన టీజర్‌తో స్పష్టమైంది.
ఈ మాజీ ‘రా’ ఏజెంట్ అయిన తారక్ ఎందుకు దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్నాడు..? ఎందుకు ‘రా’ ఏజెంట్ కబీర్ ను చంపాలని అనుకుంటున్నాడు అనేది సినిమాలో చూడాల్సి ఉంటుంది.
అన్ని YRF స్పై యూనివర్స్ సినిమాల్లానే… ఇప్పుడు వార్ 2 స్టోరీ ఉన్నట్టు స్పష్టం తెలిసిపోతుంది. అయితే… వీటికి డైరెక్టర్లు వేరు వేరు కాబట్టి… ఆ స్క్రిన్ ప్లే లో, డైరెక్షన్ లో తేడాలు మాత్రం ఉంటాయి. వీటితో పాటు అన్ని సినిమాల్లో కామన్ గా ఉండేది మితి మీరిన యాక్షన్ ఎపిసోడ్స్.
వార్ 2 లో కూడా బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయని నేడు వచ్చిన టీజర్ తో తెలిసిపోతుంది. స్టోరీ లైన్ సేమ్ టూ సేమ్ ఉన్నా… డైరెక్టర్ ఆయన ముఖర్జీ డైరెక్షన్ వర్క్స్ తో పాటు సినిమాలో ఉండే హై లెవెల్ యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది.