BigTV English

Raj Bhavan: రాజ్‌భవన్‌లో చోరీ.. నిందితుడు వారంలో రెండుసార్లు అరెస్టు

Raj Bhavan: రాజ్‌భవన్‌లో చోరీ.. నిందితుడు వారంలో రెండుసార్లు అరెస్టు

Raj Bhavan: తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ తీవ్ర కలకలం రేపుతోంది. ఈ విషయం ఆలోస్యంగా వెలుగులోకి వచ్చింది. రాజ్‌భవన్‌లోని సుధర్మ భవన్ లో హార్డ్ డిస్కులు మాయం అయ్యాయి.  వారం కిందట కొందరు వ్యక్తులు నాలుగు హార్డ్ డిస్క్‌లను చోరీ చేసినట్టు తేలింది.


చోరీకి గురైన హార్డ్ డిస్క్‌లో కీలకమైన సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. సీసీ పుటేజ్ ఆధారంగా గుర్తించారు రాజ్‌భవన్ అధికారులు గుర్తించారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేసిన రాజ్‌భవన్ అధికారులు. చోరీకి చేసిన వ్యక్తి హెల్మెట్ ధరించినట్టు సమాచారం.

గవర్నర్ నివాసం అంటే ఆషామాషీ కాదు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత. నిత్యం పోలీసులు, అధికారులతో బిజీగా ఉంటుంది. చీమ చిటుక్కు మన్నా క్షణాల్లో ఇట్టే తెలిసిపోతుంది. నిరంతరం బలగాలు పహారా, ఆపై సీసీ కెమెరాలతో నిఘా ఉంటుంది. అలాంటి తెలంగాణ రాజ్‌భవన్ లో దొంగతనం జరిగిన విషయం కలకలం రేపుతోంది.


రాజ్‌భవన్‌లోకి చోరీకి వచ్చిన వ్యక్తి తిరిగి ఎలా వెళ్లగలిగాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఏ టెక్నీషియన వచ్చినా ముఖానికి హెల్మెట్‌ పెట్టుకుని కంప్యూటర్‌ రూమ్‌లోకి ఎలా చొరబడ్డాడు? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చోరీ వెనుక ఇంటి దొంగ ఏమైనా ఉందా? లేక వేరేవారి పాత్ర ఉందా అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

ALSO READ: కేసీఆర్‌కు ఊహించని షాక్, వీసా తిరస్కరించిన అమెరికా

తెలంగాణలో మరో సంచలనం చోటు చేసుకుంది. రాజ్‌భవన్‌లో దొంగలు పడ్డారు. నిత్యం హై సెక్యూరిటీతో ఉండే రాజ్‌భవన్‌లో ఓ అగంతకుడు చేతి వాటం ప్రదర్శించాడు. మే 14న ఓ వ్యక్తి రాజ్‌భవన్ వచ్చాడు. హెల్మెట్ ధరించి నాలుగు హార్డ్ డిస్క్‌లను చోరీ చేశాడు. సుధర్మ భవన్‌లో నాలుగు హార్డ్ డిస్క్‌లు మాయం అయినట్లు రాజ్‌భవన్ సిబ్బంది గుర్తించారు.

సీసీటీవీ ఫుటేజ్‌లో ఆ గంతకుడు హార్డ్ డిస్క్‌లు తీసుకెళ్తున్నట్లు కనిపించింది. వెంటనే కంప్యూటర్ రూమ్‌కి వెళ్లి చెక్ చేశాడు. మే 20న అంటే మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

మొదటి అంతస్తులో ఉన్న రూమ్ నుంచి ఆ హార్డ్‌ డిస్క్‌లను ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు.హార్డ్‌డిస్క్‌లలో రాజ్‌భవన్ వ్యవహారాలు, కీలకమైన రిపోర్ట్‌లు, ఫైల్స్‌ ఉన్నట్టు అంతర్గత సమాచారం. 14న కంప్యూటర్‌ రూమ్‌లోకి వెళ్లింది ఎవరు? అనేదానిపై పోలీసులు దృష్టి సారించారు.

రాజ్‌భవన్‌లోనే కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్‌‌ని గుర్తించారు పోలీసులు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిసింది. అనంతరం శ్రీనివాస్‌ను అరెస్టు చేశారు.  కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించనున్నారు.

మహిళా ఉద్యోగిని ఫోటోలు మార్ఫింగ్ చేసి భయభ్రాంతులకు గురిచేసిన రాజభవన్ ఉద్యోగి. రాజ్‌భవన్‌లో చోరీ కేసులో రెండుసార్లు అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు. మార్ఫింగ్ ఫొటోల వ్యవహారంలో మొదటి సారి. రాజ్‌భవన్‌లో హార్డ్ డిస్క్ చోరీ కేసు‌లో శ్రీనివాస్ రెండోసారి అరెస్ట్. సస్పెండైనా సెక్యూరిటీని మాయ చేసి రాత్రివేళ ప్రవేశించాడు. వారంలో రెండుసార్లు ఆ వ్యక్తి అరెస్ట్ కావడం సంచలనం రేపుతోంది.

 

Related News

Medaram: నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేడారం పర్యటన

Former DSP Nalini: మాజీ డీఎస్పీ నళిని ఆవేదనపై సీఎం రేవంత్ రియాక్షన్.. కలెక్టర్‌ను ఇంటికి పంపి..?

Sammakka Sagar: సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్

HMWSSB: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. బుధవారం ఈ ప్రాంతాల్లో మంజీరా వాటర్ బంద్, కారణం ఇదే

Weather News: మళ్లీ వర్షాలు స్టార్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వర్షం..

CM Revanth Reddy: హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

Suryapet News: సూర్యాపేటలో హై టెన్షన్.. పోలీసులను ఉరికించి ఉరికించి.. బీహార్ బ్యాచ్ అరాచకం

Indrakiladri Sharannavaratri: తెలంగాణలో అంగరంగ వైభవంగా.. భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు

Big Stories

×